Moviesప్రభాస్ "బుజ్జి" లో అన్ని బాగున్నా..అదే పెద్ద మైనస్.. మీరు గమనించారా(వీడియో)..!!

ప్రభాస్ “బుజ్జి” లో అన్ని బాగున్నా..అదే పెద్ద మైనస్.. మీరు గమనించారా(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. మహానటి దర్శకుడు నాగ్ అశ్వీన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అశ్వినీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు . ఈ సినిమాలో కమలహాసన్ అదే విధంగా అమితాబచ్చన్ కూడా ప్రధాన పాత్రలో మెరవబోతున్నారు . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది .

కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే రామోజీ ఫిలిం సిటీ లో కల్కి ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే . సినిమాని మలుపు తిప్పే బుజ్జి ని ఇంట్రడ్యూస్ చేశాడు రెబెల్ స్టార్ ప్రభాస్ . భైరవ పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు . బుజ్జిని ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది ఒక కారు లాంటి వాహనమైనప్పటికీ ..అలాకాకుండా ఒక క్యారెక్టర్ పరంగానే చూస్తున్నారు జనాలు .

మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఈ బుజ్జికి ప్లస్గా మారింది. అయితే చాలా ఇది బాగున్నప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటున్నప్పటికీ ప్రభాస్ బుజ్జి క్రియేషన్ మాత్రం తెలుగు జనాలకు అంతగా నచ్చడం లేదు . ఇదంతా ఓ స్టైలిష్ టెస్లా కారులానే ఉంది గాని ఎక్కడ కొత్తగా క్రియేట్ చేసినట్లు లేదు . అంతే కాదు నాగ్ అశ్వీన్ ప్రభాస్ పాత్ర కన్నా ఈ సినిమాలో బుజ్జి పాత్రనే హైలెట్ చేసినట్లు కనిపిస్తుంది అంటున్నారు జనాలు . ఒకవేళ అదే నిజమైతే మాత్రం సినిమా హిట్ అయిన ప్రభాస్ కి క్రేజ్ దక్కకపోవచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు . ఆ ఒక్కటే మైనస్ తపిస్తే మిగతా అంతా కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్.. అయ్యే ఛాన్సెస్ నే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు . చూద్దాం మరి ఏం జరుగుతుందో ..? జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news