Moviesచిరంజీవికి అలాంటి అలవాటు ఉందా..? ఇప్పటికి నైట్ టైం అలా చేస్తూనే...

చిరంజీవికి అలాంటి అలవాటు ఉందా..? ఇప్పటికి నైట్ టైం అలా చేస్తూనే ఉంటాడా..?

కొందరికి కొన్ని అలవాట్లు పుట్టుకతోనే వస్తాయి.. మరికొన్ని పెంచే పెంపకం కొద్ది వస్తాయి . అది అందరికీ తెలిసిందే . మరి ఎలా వచ్చిందో ..ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. చిరంజీవికి ఉన్న ఒక అలవాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వ్యక్తో మనందరికీ తెలిసిందే .

కాగా మెగాస్టార్ చిరంజీవి తన తల్లి పాదాలకు నమస్కరించనిదే తన తల్లికి పాద సేవ చేసుకొని దే రాత్రి అస్సలు నిద్రపోడట. మొదటి నుంచి చిరంజీవికి అది అలవాటుగా మారిపోయిందట . మనం ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లి ముందు ఒదిగి ఉండాలి అన్న కాన్సెప్ట్ తోనే చిరంజీవి ఈ విధంగా చేస్తూ ఉంటాడట. ఇప్పటికీ చిరంజీవి నిద్రపోయే ముందు తన తల్లి పాదాలకు నమస్కరించి నిద్రపోతాడట . ఈ విషయం తెలుసుకున్న మెగా ఫాన్స్ అందుకే నువ్వు మెగాస్టార్ వి అయ్యావయ్యా అంటూ పొగిడేస్తున్నారు .

అంతేకాదు దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు . ప్రజెంట్ చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025వ సంవత్సరం గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అంతేకాదు ఈ సినిమా తరువాత చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో కమిట్ అయ్యాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news