Moviesకోట్లు ఖర్చుపెట్టిన ఏం లాభం ..ప్రభాస్ కల్కికు భారీ బొక్క పడిందిగా..ఊహించని...

కోట్లు ఖర్చుపెట్టిన ఏం లాభం ..ప్రభాస్ కల్కికు భారీ బొక్క పడిందిగా..ఊహించని షాక్..!!

పాపం ..తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు ఎంతో కష్టపడి.. ఎంతో భారీ బడ్జెట్ తో ..ఎంతో ఇష్టంగా.. ఎన్నో రాత్రులు శ్రమించి.. నాగ్ అశ్వీన్ డిజైన్ చేసిన బుజ్జి జనాల్లోకి ఎక్కలేకపోయింది . ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈవెంట్ కోసం కోట్లు ఖర్చు చేశారు మేకర్స్ . అయితే ఏం లాభం కోట్లు ఖర్చు చేసిన సరే ..ఎందుకో ఆ ఈవెంట్ సక్సెస్ కాలేదు.

ప్రభాస్ కల్కి సినిమా అనుకున్నంత హై ఎక్స్పెక్టేషన్స్ రాలేదు. ఏదో ప్రభాస్ వచ్చిన ఆ పది నిమిషాలు స్పీచ్ బాగుందే తప్పిస్తే మిగతా ఎక్కడ కూడా జనాలు వావ్ అనే రేంజ్ లో లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా పక్క ఇండస్ట్రీలోకి కల్కి సినిమా దూసుకుపోలేకపోయింది . అంతేకాదు ప్రభాస్ స్టార్ స్టేటస్ తో పోలిస్తే కల్కి ప్రమోషన్ కి వచ్చిన రెస్పాన్స్ చాలా చాలా తక్కువ అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ క్రమంలోనే కల్కి సినిమా భారీ బొక్క ఎదురుకొక తప్పదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా ఎవరైతే కల్కి సినిమాపై హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో.. తెలుగు అభిమానులకు ఓకే కాని ..మిగతా భాషలో సక్సెస్ అవుతుంది అన్న గ్యారెంటీ ఇవ్వలేమన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . నాగ్ అశ్వీన్ ఈ కామెంట్స్ ని ఎలా తీసుకుంటాడో చూద్దాం.. మొత్తానికి ఈ జూన్ 27 వ తేదీ ఈ సినిమా భారీ స్ధాయిలో ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు మేకర్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news