Moviesబాహుబ‌లి ఛాన్స్ మిస్ అయిన హీరోయిన్‌… ఆ ఒక్క కార‌ణంతోనే రాజ‌మౌళి...

బాహుబ‌లి ఛాన్స్ మిస్ అయిన హీరోయిన్‌… ఆ ఒక్క కార‌ణంతోనే రాజ‌మౌళి ప‌క్క‌న పెట్టారా..!

సినిమా రంగంలో ఒక హీరో లేదా హీరోయిన్ చేయాల్సిన పాత్ర కొన్ని కారణాలవల్ల వేరే వాళ్లకు వెళ్లిపోతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ముందు తనకు ఛాన్స్ వచ్చి వదులుకున్నాక.. ఆ సినిమా బ్లాక్ బ‌స్టర్ హిట్ అయితే.. ఆ ఛాన్స్ వదులుకున్న హీరో లేదా హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటారు. అదే ఆ సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిపోతే.. ఇక వాళ్ళ ఆవేదనకు అంతే ఉండదు. ఇప్పుడు బ‌బ్లి హీరోయిన్ రాశిఖ‌న్నా పరిస్థితి కూడా అలాగే ఉంది.

టాలీవుడ్ లో రాశీఖ‌న్నా ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ ఆమె మీడియం రేంజ్ హీరోయిన్ గానే ఉందే తప్ప.. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఆమె నటించిన ఒకే ఒక స్టార్ హీరో సినిమా ఎన్టీఆర్ ది. ఎన్టీఆర్ కు జోడిగా జై లవకుశ సినిమాలో రాశీఖ‌న్నా నటించింది. ఆ సినిమా హిట్ అయినా కూడా రాశికి ఎందుకో ? పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రాలేదు. ముందుగా ఆమె మద్రాస్ కేఫ్ అనే బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.

ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిల్ అయిపోయింది. మలయాళ – తమిళ సినిమాలు చేస్తున్నా కూడా ఆమెకు ఎందుకు ? తెలుగు అంటేనే ముందు నుంచి ఇష్టం. బాహుబలి సినిమా అడిషన్ జరుగుతున్నప్పుడు రాజమౌళి నుంచి ఆమెకు కాల్ వెళ్లిందట. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం రాశీని అడిషన్ కూడా చేశారు. అయితే రాజమౌళి రాశీఖ‌న్నాను చూసి చాలా క్యూట్ గా ఉంది అమ్మాయి… ఏదైనా లవ్ స్టోరీ కి బాగా సెట్ అవుతుంది.. అవంతిక పాత్రకు అంతగా సూట్ అవ్వదేమో అని పంపేశారట.

అయితే రాశీఖ‌న్నా స్నేహితుడు ఒకరు మంచి ప్రేమ కథ పై వర్క్ చేస్తున్నారు ఒక దర్శకుడు.. ఒకసారి ఆ కథ విను నీకు తప్పకుండా నచ్చుతుందని చెప్పారట. అలా ఊహలు గుసగుసలాడే సినిమాతో ఆమె తెలుగులో హీరోయిన్గా పరిచయం అయింది. అయితే రాజమౌళి సార్ సినిమాలో చిన్న పాత్ర అయినా తనకు చేయాలని ఉందని రాశీఖ‌న్నా చెబుతోంది. బాహుబలి లాంటి హిస్టారికల్ మూవీలో ఛాన్స్ మిస్ అవ్వటం ఎప్పటికీ బాధపడుతూ ఉంటానని ఆమె చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news