Moviesకింగ్ లాంటి మగాడు కూడా భార్య చేతిలో బకరానే..చరణ్ మరోసారి ప్రూవ్...

కింగ్ లాంటి మగాడు కూడా భార్య చేతిలో బకరానే..చరణ్ మరోసారి ప్రూవ్ చేశాడుగా..!

టాలీవుడ్ లో బలమైన మెగా ఫ్యామిలీ వారసుడిగా సినిమాల్లోకి వచ్చి… తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తన తండ్రి చిరంజీవి – బాబాయ్ పవన్ కళ్యాణ్ నటవరసత్వాన్ని అందిపుచ్చుకున్న రాంచరణ్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మనదేశంలో కాదు.. ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా కూడా రామ్ చరణ్ ఆటోగ్రాఫ్ – ఫోటోగ్రాఫ్‌ కోసం అభిమానులు వెంటపడుతున్నారు.

అంటే రామ్ చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ? పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా రామ్ చరణ్ క్రేజ్‌ ఎక్కడికో తీసుకు వెళ్ళింది. త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో దిల్ రోజు బ్యానర్లో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ ప్రాజెక్టుగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఆస్కార్ వేడుకల కోసం ఇప్పటికే అమెరికా వెళ్ళిన చరణ్ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీబిజీగా ఉంటున్నాడు. అయితే తనకు దొరికిన చిన్న బ్రేక్లో భార్య ఉపాసనతో కలిసి షాపింగ్ కు కూడా వెళ్ళాడు. అక్కడ షాపింగ్ పూర్తయ్యాక ఆ బ్యాగులు మోస్తూ ఉపాసన వెనక నడుస్తూ ఆమె వైపు తదేకంగా చూస్తూ ఆమెను ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చరణ్ వెనకాల షాపింగ్ చేసిన బ్యాగులు మోస్తూ… నడుచుకుని వస్తూ ఉంటే చరణ్ ముందు ఉపాసన చాలా వయ్యారంగా నడుస్తూ వస్తోంది.

ఇది చూసిన అభిమానులు ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా.. భార్య బ్యాగులు మోయ‌డం మాత్రం తప్పించుకోలేడు అని కామెంట్ చేస్తున్నారు. పెళ్లయితే అంతే భార్య‌ షాపింగ్ సంచులు మోయాల్సి వ‌స్తుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈనెల 12న 95వ ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవం జరుగుతుంది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌ క్యాటగిరిలో నాటు నాటు పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ పాట ఆస్కార్ అవార్డు ఎగరేసుకుపోతుందో లేదో ఈ నెల‌ 12న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news