Moviesబిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్ లీక్ అయిపోయిందోచ్.. గూస్...

బిగ్ బ్రేకింగ్: ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్ లీక్ అయిపోయిందోచ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సినిమా పేరు..!!

అబ్బబ్బా.. ఇది నిజంగా నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ తప్పించే న్యూస్ అనే చెప్పాలి .ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 సినిమా పై అప్డేట్ రాలేదు.. ఇవ్వలేదు అంటూ నెత్తి నోరు మొత్తుకున్నారు. ఫైనల్లీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా ఓకే చేసిన వేళా విశేషం ..ఒకదాని తర్వాత ఒకటి ఎన్టీఆర్ 30 సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ అవుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నిన్న కాక మొన్ననే జాన్వి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కొరటాల శివ.

చాలా సైలెంట్గా ట్రెడిషనల్ లుక్స్ లోనే ఎక్కడ ఏమి చూపించాలో చూపిస్తూ కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది అంటూ ఒక్క పోస్టర్ తోనే కన్ఫర్మ్ చేసేసింది జాన్వి కపూర్ . ఈ ఆనందం నుంచి అభిమానులు ఇంకా బయటకు రాకముందే.. మరో క్రేజీ న్యూస్ ఎన్టీఆర్ థర్టీ సినిమాకు సంబంధించి లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎస్.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కకపోతున్న ఎన్టీఆర్ 30 సినిమాకి “దేవర” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సినిమా వర్గాల నుంచి తెలుస్తుంది.

ఫిలిం ఛాంబర్ లో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్ లీక్ అయినట్లు తెలుస్తుంది . దీంతో ఎన్టీఆర్ థర్టీ సినిమాకి “దేవరా” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు జనాలు ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ఎన్టీఆర్ లాంటి గట్స్ ఉన్న హీరోకి దేవరా అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని టైటిల్ బట్టే కథలో ఎంత మేటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు నందమూరి అభిమానులు .అంతేకాదు కొరటాల ఎన్టీఆర్ కాంబో పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు నందమూరి అభిమానులు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని సినిమా స్టార్ట్ అవ్వకముందే రివ్యూలు ఇచ్చేస్తూ హంగామా చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో #NTR30 ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news