MoviesSobhana ఆ హీరో క‌మిట్‌మెంట్లు, కోరిక తీర్చ‌లేకే శోభ‌న తెలుగు సినిమాకు...

Sobhana ఆ హీరో క‌మిట్‌మెంట్లు, కోరిక తీర్చ‌లేకే శోభ‌న తెలుగు సినిమాకు దూర‌మైందా…?

టాలీవుడ్ లో ఇప్పుడు మలయాళీ హీరోయిన్ల హవా నడుస్తోంది. ప‌దుల సంఖ్యలో మలయాళీ ముద్దు గుమ్మలు టాలీవుడ్ లో పాగా వేసి వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. అలాగే 1980 -1990వ దశలోనూ కొందరు మలయాళీ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల‌లో చక్రం తిప్పారు. అలాంటి వారిలో నటి శోభన ఒకరు శోభన. ఆమె సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి కూడా స్టార్ హీరోయిన్. దీంతో ఆమె సినిమాల్లోకి వచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

తెలుగులో కూడా ఆమె బాలకృష్ణ – నాగార్జున – చిరంజీవి – వెంకటేష్ – మోహన్ బాబు – నరేష్ – రాజేంద్రప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలతో నటించి మంచి హిట్లు కొట్టింది. ముఖ్యంగా శోభన చారడేసి కళ్ళు… ఆమె ఎక్స్ప్రెషన్లు, ఎక్స్పోజింగ్‌కు దూరంగా… నటనకే ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎంపిక చేసుకోవడం ఇవన్నీ ఆమెను మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు సాయి పల్లవి ఎలా అయితే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ అభిమానులను సంపాదించుకుందో… అప్పట్లో శోభన కూడా ఎక్స్పోజింగ్‌కు దూరంగా ఉండేది.

శోభన చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి నేర్చుకోవడంతో ఆమెకు డ్యాన్సుల్లో కూడా తిరుగులేదు.
ఆమె తెలుగులో కెరీర్ ఆరంభంలో గీతాకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కోకిల సినిమాలో నరేష్ కు జోడిగా నటించింది. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ పక్కన అప్పుల అప్పారావు సినిమా చేసింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో పాటు శోభనపాత్రకు మంచి పేరు వచ్చేలా చేసింది. అయితే ఆమెతో పాటు ఎక్కువ సినిమాలలో నటించిన ఒక హీరో టార్చర్ తట్టుకోలేక… అతడి కోరికలు తీర్చలేక శోభన టాలీవుడ్‌కు త్వరగా దూరమైపోయింది అన్న గుసగుసలు అప్పట్లో వినిపించాయి.

ఆ హీరో ఎవ‌రో అంద‌రికి తెలిసిందే. అత‌డితో శోభ‌న చాలా సినిమాలు చేసింది. ఇప్పుడు ఆ హీరో పేరు బయట పెట్టడం భావ్యం కాదు. అయితే అతడి టార్చర్ వల్లే శోభన ఇక తెలుగులో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకుందని అంటారు. ఆ తర్వాత ఆమె కేరళ వెళ్ళిపోయి అక్కడ భరతనాట్యం శిక్షణ ఇస్తూ కాలం గడిపేస్తోంది. ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. అయితే చాలా రోజుల తర్వాత తెలుగులో మోహన్ బాబు పక్కన ఒక సినిమాలో జోడిగా కనిపించింది. శోభన తెలుగులో రీఎంట్రీ ఇచ్చి అత్త – అమ్మ – అక్క పాత్రలు చేస్తే చూడాలనుకునే ఆమె అభిమానులు ఎంతోమంది ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news