Movies"టైగర్ టైం ఆగయా ".. అభిమానులకి పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్..!!

“టైగర్ టైం ఆగయా “.. అభిమానులకి పిచ్చెక్కించే అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్..!!

ఎస్ ఇది నిజంగా నందమూరి అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు జూనియర్ ఎన్టీఆర్ను సోషల్ మీడియాలో ఓ పనిలేని బ్యాచ్ టార్గెట్ చేసి ట్రోల్ చేసింది. మరి ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెడుతుంది అంటూ నోటికి వచ్చిన వాగుడు వాగుతూ జూనియర్ ఎన్టీఆర్ను ఇబ్బందికరంగా ట్రోల్ చేశారు. అయితే వాళ్ళందరి వాళ్లందరి నోటికి చెక్ పెట్టే విధంగా ఎన్టీఆర్ ఒకే ఒక్క మెసేజ్ తో వాళ్ల నోరులు మూయించాడు. ప్రజెంట్ అదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది . అంతేకాదు రీసెంట్గా హాలీవుడ్ క్రిటిక్స్ విభాగంలో ఏకంగా నాలుగు అవార్డును అందుకొని సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే మార్చి 12న ఆస్కార్ అవార్డ్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం సినిమాను మరింత రేంజ్ లో ప్రమోట్ చేస్తుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు మొదలు పెట్టింది చిత్ర యూనిట్ . ఆర్ ఆర్ ఆర్ టీం మొత్తం అమెరికా చేరుకుంది. కాగా నందమూరి తారకరత్న మరణంతో కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే ఉండిపోయాడు . ఈ క్రమంలోని కొందరు పనిలేని బ్యాచ్ ఆర్ఆర్ఆర్ టీం నందమూరిని జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతుందని..సక్సెస్ విషయంలో ఆయనకు ఏ భాగం లేదని సినిమా హిట్ అవ్వడానికి కర్త – కర్మ – క్రియ అన్ని చరణ్ నే అంటూ హంగామా చేసింది ఓ పనిలేని బ్యాచ్ .

ఈ క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ కూడా మండిపడిపోయారు . రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఒకే ఒక్క పోస్ట్ వాళ్ళ నోరు మూయించింది . ఆస్కార్ అవార్డ్స్ లో పాల్గొనేందుకు జూనియర్ ఎన్టీఆర్ అమెరికా చేరుకున్నారు . అమెరికా వెళ్ళాక ఎన్టీఆర్ ఫస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చేశారు . ఆయన బాల్కనీలో నిల్చోని నగరం వైపు చూస్తున్నట్లు ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేస్తున్నారు . అంతేకాదు ఆయన టీషర్ట్ టైగర్ సింబల్ ఉంది . దీంతో ఇప్పుడు టైగర్ టైమ్ వచ్చింది అంటూ సింబాలిక్ గా చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ నందమూరి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇక అమెరికాలో మొత్తం ఎన్టీఆర్ – రామ్ చరణ్ హంగామా నడుస్తుందని త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు కచ్చితంగా మార్చి 12న అనౌన్స్ చేసే ఆస్కార్ విన్నింగ్ లిస్టులో ఆర్ఆర్ఆర్ పేరు ఉంటుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . దీంతో ఒక్కసారిగా ఆర్ఆర్ఆర్ పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news