News"తారక్ విషయంలో అలా చేయకపోతే చంపేస్తామని బెదిరించారు"..రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!!

“తారక్ విషయంలో అలా చేయకపోతే చంపేస్తామని బెదిరించారు”..రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళిని ఓ వర్గం ప్రజలు బెదిరించారా..? అంటే అవునని అంటున్నారు జక్కన్న. రీసెంట్గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్ . సినిమా జనాలు ఎంత ఎంతగానో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకుంది . ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఆస్కార్ అవార్డు అందుకున్న దాఖలాలు లేవు. ఫస్ట్ టైం ఆ అవార్డు అందుకుని సంచలన రికార్డ్ నెలకొల్పి ఫిలిం ఇండస్ట్రీలోని సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, చరణ్.. సినిమాలో నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లగంజ్, కాలభైరవ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ..లిరిసిస్ట్ చంద్రబోస్ పేర్లు వైరల్ అవుతున్నాయి .ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నప్పుడు తనకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయని ..ఓ వర్గం ప్రజలు ఆయనను బెదిరించారని ..తారక్ ను ముస్లిం గెటప్ లో చూపించడం కొంతమంది జనాలకు నచ్చలేదని .. ఆ క్రమంలోనే హిందూ జాతీయ వాదం ప్రచారం చేస్తున్నానని లెఫ్ట్ వింగ్ వాళ్లు విమర్శలు చేశారని జక్కన చెప్పుకొచ్చారు .

అంతేకాదు సినిమాలో తారక్ ను అలా చూపిస్తే సినిమాను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారట. అంతేకాదు ఈ సినిమాలో ముస్లిం గెటప్ లో ఉన్న తారక్ పాత్రను డిలిట్ చేయకపోతే.. థియేటర్ లు తగలబెడతామని.. అలాంటి సీన్లు తొలగించిన పక్షంలో సినిమాను ఆపేస్తామని.. వార్న్ కూడా చేశారట . అవన్నీ ఎదుర్కొని రాజమౌళి ఫైనల్లీ తాను అనుకున్న ఆస్కార్ అవార్డును అందుకున్నాడు. త్వరలోనే రాజమౌళి మహేష్ బాబు తో ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news