Newsఅతిలోక సుంద‌రి శ్రీదేవిని భార్య‌గా మిస్ అయిన 6 గురు టాలీవుడ్...

అతిలోక సుంద‌రి శ్రీదేవిని భార్య‌గా మిస్ అయిన 6 గురు టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే…!

అతిలోక అందాల సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..! నిజంగా ఆమె సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె దివి నుంచి భువికేగిన వరకు ఒక పెద్ద చరిత్ర అవుతుంది. ఆ చరిత్ర రాయటానికి పుస్తకాలు.. పుస్తకాలు సరిపోవు. ఎక్కడో తమిళనాడులోని శివకాశిలో పుట్టిన శ్రీదేవిని స్టార్ హీరోయిన్గా మార్చింది తెలుగు సినిమా జనాలే. ఆ తర్వాతే ఆమెకు తమిళంలో అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళంలో తిరుగులేని ఆగ్ర హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పుడే శ్రీదేవి బాలీవుడ్లోకి ఎంటర్ అయింది. అక్కడ స్టార్ హీరోలకు జోడిగా నటించి దేశాన్ని ఉపేసిన అతిలోకసుందరి అయిపోయింది.

శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాక ఆమెకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోవడంతో పాటు లెక్కకు మిక్కిలిగా డబ్బులు కూడా వచ్చి పడ్డాయి. అదే సమయంలో ఆమె చిన్న రాంగ్ స్టెప్ తో జీవితాన్ని నాశనం చేసుకుంది. అదే తనకంటే వయసులో చాలా పెద్దోడు.. అందులోనూ రెండో పెళ్లి వాడు అయిన‌ బోనీకపూర్‌ను పెళ్లాడటం. బోనికపూర్‌ను ఎప్పుడు అయితే శ్రీదేవి పెళ్లి చేసుకుందో ? అప్పటినుంచి ఆమె ఒక బందీ అయిపోయిందని చెప్పాలి. అసలు శ్రీదేవి అంటే ఎంత ? అందం.. రాంగోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ అయితే ఆమె అందాన్ని గురించి చెప్పటానికి మాటలు సరిపోవని చెబుతూ ఉంటారు.

అంత గొప్ప అందం శ్రీదేవిది. అసలు శ్రీదేవిని చూసేందుకు ఏకంగా దుబాయ్ నుంచి అరబిషేక్‌లు వచ్చి లక్షల ఖర్చు పెట్టి ఆమెను చూసి వెళ్లేవారట. అంటే శ్రీదేవి అందం దేశ విదేశాల్లో వాళ్లను కూడా ఎంతలా ప్రభావం చేసిందో అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రీదేవి టాలీవుడ్ లో ఒక ఆరు గురు స్టార్ హీరోలలో ఏదో ఒక స్టార్ హీరోకు భార్యగా కావలసింది. అయితే ఆమె దురదృష్టమో వాళ్లకు శ్రీదేవి భార్య అయ్యే అదృష్టం లేదో.. ఏమోగానీ ఆ ఆరుగురు హీరోలు కూడా ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు.

శ్రీదేవి కెరియ‌ర్ ప్రారంభంలో చంద్రహాసన్‌తో సినిమాలలో నటించేటప్పుడు చంద్రహాసన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. అయితే అప్పుడే ఆమెకు వ‌రుస‌ అవకాశాలు వస్తూ ఉండడంతో శ్రీదేవి తల్లి ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. అలా చంద్రహాసన్ భార్య అయ్యే అవకాశం ఆమె కోల్పోయింది.
ఆ తర్వాత శ్రీదేవి కమల్ హాసన్ ను పిచ్చిపిచ్చిగా ప్రేమించేసింది. కమల్ ను తన భర్తగా ఊహించుకుంది. అయితే కమల్ శ్రీదేవికి షాక్ ఇచ్చి వాని గణపతిని పెళ్లి చేసుకున్నాడు. కమల్ తాను వాణిని పెళ్లి చేసుకుంటున్నానని శ్రీదేవికి చెప్పినప్పుడు.. ఆమె తన గుండెల్లో ఎంతో బాధను దిగమింగుకొని కమలహాసన్ కు ఆల్ ద బెస్ట్ చెప్పింది.

ఆ తర్వాత రజనీకాంత్ కూడా శ్రీదేవి ఇంటికి తరచూ వెళ్లేవాడు. శ్రీదేవి ఇంట్లో వాళ్ళు కమలహాసన్ – శ్రీదేవి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. ఆ తర్వాత రజనీతో అయినా శ్రీదేవికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. రజనీ కూడా శ్రీదేవిని కాకుండా మరో అమ్మాయితో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత తెలుగు హీరో డాక్టర్ రాజశేఖర్‌ను మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని శ్రీదేవి తల్లి స్వయంగా అడిగారట. ఈ విషయం రాజశేఖర్ ఎన్నో సందర్భాలలో చెప్పారు. అప్పటికే శ్రీదేవి పెద్ద స్టార్.. రాజశేఖర్ కెరీర్ పరంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజశేఖర్ అంత గొప్ప హీరోయిన్ తనకు భార్య అవటం ఏంటని షాక్ లోకి వెళ్ళిపోయాడట.

తనకు కెరియ‌ర్ ముఖ్యం అనుకుని.. అవునని కాదని చెప్పకపోవడంతో ఆ సంబంధం అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత జేడి చక్రవర్తి శ్రీదేవి కజిన్ మహేశ్వరి తో కలిసి వరుసగా సినిమాలు చేశారు. ఆ సమయంలో జెడి.. శ్రీదేవి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా జేడీని చూసి శ్రీదేవి తల్లి నా కూతుర్ని మ్యారేజ్ చేసుకుంటావా ? అని అడిగినట్లు జెడి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళిపోయాక మిథున్ చక్రవరితో ప్రేమలో పడడంతో పాటు మిథున్ తో కొన్నాళ్లు సహజీవనం కూడా చేసిందని అంటారు.

అయితే అప్పటికే మిథున్‌కు యోగితా బాలితో పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి కోసం తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఆయన ఒప్పుకోలేదు. దీంతో శ్రీదేవి తల్లి కూడా మిథున్ కు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడలేదు. ఇలా ఆరుగురు హీరోలు శ్రీదేవికి భర్తలుగా వచ్చే అవకాశం కాలదన్నుకుని చివరకు వెళ్లి వెళ్లి ముసలోడు బోనీకపూర్ మాయలో పడిపోయింది. ప్రేమ గుడ్డిది అంటే ఇదేనెమో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news