Moviesనాని "దసరా" పబ్లిక్ టాక్ : ఆ మాట అన్నోడి ని...

నాని “దసరా” పబ్లిక్ టాక్ : ఆ మాట అన్నోడి ని చెప్పుతోనే కొట్టాలి..తిరగబడిన ఫ్యాన్స్..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా దసరా . కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ దసరా సినిమా గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఫస్ట్ షో తన సూపర్ డూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా నాని కెరియర్ లోనే ఈ సినిమా ఇంతటి పాజిటివ్ టాక్ సంపాదించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు పలువురు బడా స్టార్ ప్రముఖులు కూడా నాని సినిమాను చూసి మంచి రివ్యూస్ తో సినిమాకి పాజిటివ్ టాక్ అందించడం అభిమానులకి ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది.

కాగా నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. అయితే కొందరు జనాలు ఈ సినిమాని ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఆస్కార్ అవార్డు సైతం కొట్టబోతుంది దసరా అంటూ ట్విట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోని కొందరు ఆర్ఆర్ఆర్ సినిమా ఫ్యాన్స్ అలాంటి కామెంట్స్ పై మండిపడుతున్నారు . నాని సినిమా బాగుందా..? బాగాలేదా ..? అంతవరకే మాట్లాడాలి .. దసరా సినిమా ఆస్కార్ అవార్డుకి నామినేట్ అవుతుంది అనడం పిచ్చితనమే.

అసలు దసరా సినిమా లో అంత సీన్ లేదు . కేవలం సినిమా నాని నటన పరంగానే హిట్ టాక్ సంపాదించుకుంటుంది ..తప్పిస్తే కధ పరంగా కంటెంట్ పరంగా ఎక్కడ అంత గ్రేస్ మూమెంట్స్ ఏమీ లేవు అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యాన్స్ వ్స్ నాని హీరో ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరుతుంది . ఈ క్రమంలోనే కొందరు జనాలు మాట మాట పెంచి.. సినిమా టాక్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ ఇలా కొట్టుకు చావడం కామన్ గా కనిపిస్తుంది . ఈ తంతు ఎప్పుడు మారుతుందో వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news