Moviesనాని "దసరా" పబ్లిక్ టాక్: సినిమాకి వెళ్లే వాళ్ళు అది ఖచ్చితంగా...

నాని “దసరా” పబ్లిక్ టాక్: సినిమాకి వెళ్లే వాళ్ళు అది ఖచ్చితంగా తీసుకెళ్లండి రా అబ్బాయిలు..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా సినిమా టాక్ కి వైరల్ గా మారుతుంది. మనకు తెలిసిందే గత కొంతకాలంగా కెరియర్ లో హిట్ లేక అల్లాడుతున్న నానికి దసరా సినిమా ఎంత ప్రత్యేకమో . ఈ సినిమా హిట్ అయితే కానీ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేని పరిస్థితి నానికి ఎదురయింది . అయితే ఎట్టకేలకు ఆ సవాళ్లను సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటు నాని దసరా సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు అంటున్నారు జనాలు.

సినిమాలో కధ పరంగా కంటెంట్ పరంగా ఎక్కడ నెగటివ్ మార్క్ లేకుండా డిజైన్ చేసుకున్న శ్రీకాంత్ ఓదేల.. నానిని తన ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో.. అలా చూపించి వాళ్ళ ఆకలి తీర్చేశారు . మరీ ముఖ్యంగా సినిమాకి ఈ సినిమాకి క్లైమాక్స్ హైలెట్గా మారింది . ఎవరు ఊహించని విధంగా లాస్ట్ లో సడన్ ట్వీస్ట్ పెడుతూ సినిమా రూపురేఖల్ని మార్చేశాడు శ్రీకాంత్. ఓ కొత్త డైరెక్టర్ ఇంతలా ఆలోచించి కథను డిజైన్ చేయడం నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిన విషయమే అంటున్నారు సినీ ప్రముఖులు .

అంతేకాదు నాని ఫాన్స్ సినిమా చూసి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడమే కాకుండా సినిమాకి వెళ్లే వాళ్లకి సజెషన్స్ కూడా ఇస్తున్నారు . సినిమాకి వెళ్లే వాళ్ళు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లండి.. సినిమాలో ప్రతి సీన్ కి.. ప్రతి మూమెంట్ కి అరిచి అరిచి అరుపులతో గొంతు ఎండిపోతుంది.. నాని సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ గొంతు చించుకొని మరి అరుస్తున్నారు . ఈ క్రమంలోనే నాని దసరాకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నాని అభిమానులు అంతే కాదు లాస్ట్ లో ఫైనల్ గా ఓ డైలాగ్ నానికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. “హిట్ కొట్టావ్ రా నాని నా కొడకా”..అంటూ సినిమాలోని డైలాగ్ ని మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news