Movies108లో ల‌క్కీ హీరోయిన్‌ను మ‌ళ్లీ రిపీట్ చేస్తోన్న బాల‌య్య‌... సెంటిమెంట్ క్లిక్...

108లో ల‌క్కీ హీరోయిన్‌ను మ‌ళ్లీ రిపీట్ చేస్తోన్న బాల‌య్య‌… సెంటిమెంట్ క్లిక్ అయితే బ్లాక్‌బ‌స్ట‌రే..!

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లతో కెరీర్లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ తర్వాత ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు డ్యూయల్ రూల్ చాలా బాగా కలిసి వస్తుంది. ఇటీవల బాలయ్య కొట్టిన సూపర్ హిట్లలో ఆయన డ్యూయల్ రోల్లోనే నటించారు.

తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలయ్య డ్యూయ‌ల్ రోల్ లో నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా కథాంశం తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని.. బాలయ్య కూడా తెలంగాణ యాసలోనే డైలాగులు చెబుతారని అంటున్నారు. ఇప్పటివరకు తన సినిమాలలో అనిల్ రావిపూడి తన పెన్ పవర్ తో సూపర్ గా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అయితే తొలిసారిగా బాలయ్య సినిమా కోసం డబుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ కూడా అందిస్తున్నారని తెలుస్తోంది.

కథలో భాగంగా బాలయ్య 60 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు. బాలయ్య కూతురుగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. వీరసింహారెడ్డి సినిమాలో ఆమె పాత్రను ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఇప్పుడు తనకు కలిసి వచ్చిన హీరోయిన్ నే మరోసారి బాలయ్య రిపీట్ చేస్తున్నారు. అయితే కాజ‌ల్ మెయిన్ హీరోయిన్ కాగా.. హానీరోజ్ సెకండ్ హీరోయిన్ అని టాక్ ? ఇటు అనిల్ రావిపూడి కూడా ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ హిట్ల‌తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

ఇవన్నీ వర్క్ అవుట్ అయితే ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టటం ఖాయం. ఇక అఖండ – వీరసింహారెడ్డి లాంటి సూపర్ హిట్ల తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు రు. 100 కోట్ల రేషియోలో బిజినెస్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ యేడాది ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news