Moviesచనిపోయినా ఆ జ్ఞాపకం చెదరకూడదు.. బాలయ్య అంటే ఇష్టంతో తారకరత్న ఏం...

చనిపోయినా ఆ జ్ఞాపకం చెదరకూడదు.. బాలయ్య అంటే ఇష్టంతో తారకరత్న ఏం చేసాడో చూడండి..!


ప్ర‌ముఖ సినీ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతితో ఇటు సినిమా రంగంలోనూ, అటు తెలుగుదేశం వ‌ర్గాల్లోనూ తీవ్ర‌మైన ఆవేద‌న క‌నిపిస్తోంది. నందమూరి, నారా, టీడీపీ అభిమానులు అంద‌రూ తీవ్ర దుంఖః సాగ‌రంలో మునిగిపోయారు. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు తార‌క‌ర‌త్న మృతికి సంతాపాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు తార‌క‌ర‌త్న మంచిత‌నం గుర్తించి ప్ర‌స్తావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తార‌క‌ర‌త్న చేతిపై ఉన్న టాటూ ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది

తార‌క‌త‌ర్న చేతిపై ఉన్న ఆ టాటూ సింహం బొమ్మ‌ది. ఆ బొమ్మ కింద బాబాయ్ బాల‌య్య ఆటోగ్రాఫ్ కూడా ఉంటుంది. బాబాయ్ బాల‌య్య అంటే తార‌క‌ర‌త్న‌కు ఎంతో ఇష్టం. అస‌లు బాబాయ్ బాల‌య్య స్ఫూర్తితోనే తార‌క‌ర‌త్న సినిమాల్లోకి వ‌చ్చాడు. బాల‌య్య స‌పోర్ట్ తార‌క‌ర‌త్న‌కు ఎప్పుడూ ఉండేది. అయితే బ్యాడ్‌ల‌క్ తార‌క‌ర‌త్న సినిమాల్లో అంత‌గా నిల‌దొక్కుకోలేక‌పోయాడు.

ఇక బాబాయ్‌పై త‌న‌కు ఉన్న అభిమానం ఎప్పుడూ చెక్కు చెద‌ర‌కూడ‌ద‌నే తార‌క‌ర‌త్న బాబాయ్ పేరున ప‌చ్చ‌బొట్టుగా పొడిపించుకున్నాడు త‌న చేతిపైన‌..! దానికిందే బాల‌య్య ఆటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఇలా బాబాయ్‌, అబ్బాయ్ ఇద్ద‌రిమీద ఒక‌రిపై మ‌రొక‌రికి చెక్కు చెద‌ర‌ని ప్రేమ ఉంటుంది. తార‌క‌ర‌త్న గుండెపోటుతో కుప్ప‌కూలిపోయిన‌ప్పుడు బాల‌య్య అన్నీ తానే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకున్నాడు.

తార‌క‌ర‌త్న కోలుకోవాల‌ని యోగం జ‌రిపించాడు. తార‌క‌ర‌త్న చెవిలో మృత్యుంజ‌య మంత్రం జ‌రిపించాడు. అప్ప‌టిక‌ప్పుడు బెంగ‌ళూరు నారాయ‌ణ హృద‌యాల‌య వైద్యుల‌తో మాట్లాడి అక్క‌డ‌కు షిఫ్ట్ చేశారు. చాలా రోజుల పాటు బాల‌య్య ఆ హాస్ప‌టల్లోనే మ‌కాం వేసి మ‌రీ తార‌క‌ర‌త్న‌కు వైద్యం జ‌రిగేలా చూశారు. విదేశీ వైద్యుల‌ను పిలించి మ‌రీ వైద్యం అందేలా చేశారు.

హాస్ప‌ట‌ల్ బిల్లుల‌ను మొత్తం బాల‌య్యే చెల్లించారు. కుటుంబ స‌భ్యుల‌కు అనుక్ష‌ణం ధైర్యం చెపుతూ వారిని ఓదారుస్తూ ఆ కుటుంబం వెంటే ఉన్నారు. అయితే ఈ ప్రేమ‌ను చూసి విధికి క‌న్ను కుట్టిన‌ట్టు ఉంది. బాబాయ్‌, అబ్బాయ్ బంధాన్ని ఇంత త్వ‌ర‌గా విడ‌దీసేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news