Moviesతార‌క‌ర‌త్న కెరీర్‌లో ఆ రెండు సినిమాల టైటిల్స్ ఎందుకు స్పెష‌లో తెలుసా…!

తార‌క‌ర‌త్న కెరీర్‌లో ఆ రెండు సినిమాల టైటిల్స్ ఎందుకు స్పెష‌లో తెలుసా…!

నందమూరి తారకరత్న ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తారకరత్న గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్‌కు తారకరత్న మనవడు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు. 20 ఏళ్ల వయసులోనే అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను తలదన్నేలా తారకరత్న గ్రాండ్ ఎంట్రీ జరిగింది. 200 ఒకేసారి 9 సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోవడంతో తారకరత్న వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

ఒక హీరో లాంచింగ్ రోజునే తొమ్మిది సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోవడం ప్రపంచ సినీ చరిత్రలోనే ఎంత పెద్ద హీరోకు అయినా సాధ్యం కాలేదు. కానీ తారకరత్న ఎంట్రీ అంత గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమాల ప్రారంభోత్సవానికి అప్పటి సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు.. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు.

ఇప్పటివరకు సినిమాల్లో కంటిన్యూ అవుతూ క్రియాశీలకంగా ఉన్న తారకరత్న తన కెరీర్లో 22 సినిమాలలో నటించాడు. తారకరత్న తొలి సినిమాగా ఒకటో నెంబర్ కుర్రాడు రిలీజ్ అయింది. తారకరత్నకు జోడిగా రేఖ హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఆనందం సినిమాతో పాటు కొన్ని సినిమాలతో రేఖ పాపులర్ హీరోయిన్. విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు ఇద్దరు అగ్ర దర్శకులు పని చేశారు. రైటర్ గా కే. రాఘవేంద్రరావు పనిచేయగా… మరో సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

కీరవాణి అందించిన పాటలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా టైటిల్‌ను పోలి ఉన్నట్టుగా ఈ సినిమాకు కూడా ఒకటో నెంబర్ కుర్రాడు అని టైటిల్ పెట్టారు. సినిమా ఒక మోస్త‌రు విజయం సాధించింది. ఇక తారకరత్న రెండో సినిమా తన బాబాయ్ బాలకృష్ణకు ముద్దుగా ఉన్న బిరుదు యువరత్న టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తో తారకరత్న రెండో సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా జస్ట్ యావరేజ్ గా నిలిచింది. ఇది కూడా 2002లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జివిధ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఉప్ప‌ల‌పాటి నాగేశ్వ‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

తారకరత్న మూడో సినిమాగా తన పేరుతోనే తారక్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2003 ఏప్రిల్ 3న రిలీజ్ అయింది. ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను నిర్మించగా బాల శేఖర్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు ఒక మోస్త‌రుగా ఉన్నాయి. అయితే అప్పటికే తారక్‌ తొలి రెండు సినిమాలో అంచనాలు అందుకోలేకపోవడంతో తారక్ బాక్సాఫీస్ దగ్గర పరాజ‌యం పాలయింది. ఆ తర్వాత తారకరత్న కొన్ని సినిమాల్లో నటించిన అవేవీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. దీంతో అమరావతి సినిమాతో తారకరత్న విలన్ అవతారం ఎత్తాడు. తారకరత్న ఎన్ని సినిమాల్లో నటించిన బాబాయ్ బిరుదు యువరత్న – తన పేరుతో చేసిన తారక్ సినిమా టైటిల్స్ ఎప్పటికీ స్పెషల్ గా ఉండిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news