Moviesఆ ఒక్క రీజన్ తోనే లావణ్యను రిజెక్ట్ చేసిన చిరంజీవి.. లేకపోతే...

ఆ ఒక్క రీజన్ తోనే లావణ్యను రిజెక్ట్ చేసిన చిరంజీవి.. లేకపోతే ఉపాసన పక్కన కూర్చి వేసి కూర్చునేది..!!

త్వరలోనే మెగా ఇంట మరో పెళ్లి భాజా మోగనుందా..? అంటే అవునని అంటున్నారు సినిమా ప్రముఖులు . టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తండ్రి నాగబాబు సైతం అదే విషయాన్ని కన్ఫామ్ చేశాడు. మెగా వరుణ్ తేజ్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తాడని ..తనకి కాబోయే భార్య వివరాలను అఫీషియల్గా అభిమానులకు వెల్లడిస్తాడని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో సోషల్ మీడియాలో గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ లవ్ ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలు మరోసారి వైరల్ అయ్యాయి. అయితే మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోయేది లావణ్యని కాదు వెంకటేష్ చిన్న కూతురుని అంటూ తెలుస్తుంది . మెగా ఫ్యామిలీలో ఇండస్ట్రీలో నుంచి వచ్చిన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుంటే చెడు జరుగుతుందని.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్స్ ని , హీరోస్ ని మన ఇంట్లోనే ఆడపిల్లలకు అబ్బాయిలకు పెళ్లి చేయొద్దు అంటూ ముందుగానే హెచ్చరించారట .

ఆ కారణంగానే ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఉన్న అల్లుళ్లను , కోడలను ఇంటికి తెచ్చుకోకూడదనే విధంగా రూల్స్ పెట్టుకున్నారట. ఆ ఒక్క కారణంతోనే లావణ్య త్రిపాఠి ని మెగాస్టార్ రిజెక్ట్ చేశాడని ..లేకపోతే అందంలోనూ , చదువులోనూ ఈడు జోడులోను వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి చక్కని జోడి అని చెప్పుకొస్తున్నారు. అయితే వెంకటేష్ కూతురు – మెగా వరుణ్ తేజ్ కు పర్ఫెక్ట్ జోడి కాకపోయినా స్నేహ బంధాన్ని వియ్యంకులుగా చేసుకోవడం కోసమే ఇలా చేస్తున్నాడు అంటూ మరో టాక్ వినిపిస్తుంది . ఏది ఏమైనా సరే మరి కొన్ని రోజుల్లో ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన వచ్చేస్తుంది ..మెగా ఇంటికి కాబోయే కోడలు ఎవరో తెలిసిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news