Moviesఏ జన్మలో చేసుకున్న పాపమో..ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన వాణిజయరాం..!!

ఏ జన్మలో చేసుకున్న పాపమో..ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన వాణిజయరాం..!!

ఇది నిజంగా సినిమా ఇండస్ట్రీకి ఓ బ్యాడ్ మంత్ అనే చెప్పాలి . వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సెలబ్రిటీస్ అందరూ తనువు చాలించడం సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకే కాదు సినీ లవర్స్ కు అభిమానులకు తీవ్ర శోకసంద్రాన్ని మిగులుస్తుంది. కాగా రెండు రోజుల క్రితమే టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న కళాతపస్వి కే విశ్వనాథ్ అనారోగ్య కారణంగా మృతి చెందారు . ఆ విషాదఛాయల నుండి కోలుకోక ముందే మరో స్టార్ సెలబ్రిటీ కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీని శోకసంద్రంలోకి నెట్టేసింది.

స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న వాణి జయరాం ..కొద్ది గంటల క్రితమే కన్నుమూశారు . క్లాస్ అయినా.. మాస్ అయినా.. జానపద మైన.. జాబ్ బీటైన వాణి జయరాం పాడితే ఆ పాట సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే ..అప్పట్లో నాటి పాటలు అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు వాణి జయరాం. ఆమె గొంతు కదిపితే ఆ పాట వింటున్న వాళ్లు కాళ్ళు తెలియకుండా చిందులు వేయాల్సిందే . అలాంటి ఓ స్పెషల్ టాలెంట్ గల సింగర్ గా పేరు సంపాదించుకున్న వాణిజయరాం.

దాదాపు పదివేల పదివేలకు పైగానే పాటలు పాడి సంగీత ప్రియులని అలరించింది వాణిజయరాం. సుమారు పది భాషలలో ఆమె పాటలు పాడింది . ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారం కూడా ప్రకటించింది . కాగా ఆ అవార్డు అందుకోకుండానే ఆమె కన్నుమూయడం బాధాకరం . ఇదే విషయాన్ని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో చెపుతూ బాధపడుతున్నారు .

కాగా 1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరు లో పద్మావతి , దురైస్వామి అనే దంపతులకు జన్మించిన వాణి జయరాం తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది . కాగా వాణిజయరాం కి పిల్లలు లేరు ఆ లోటు సంగీతమే తీర్చిందని చెప్తూ ఉంటారు ఆమె. వాణి జయరాం భర్త జయరాం 2018లో కన్నుమూశారు. అనారోగ్య కారణంగా వాణిజయరాం కన్నుమూయడంతో సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోయింది. పలువురు స్టార్స్ ఆమె మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news