NewsNandamuri Tarakaratna తారకరత్న ఎంత దురదృష్టవంతుడంటే..ప్రభాస్ సినిమా లో ఆఫర్ వచ్చినా...

Nandamuri Tarakaratna తారకరత్న ఎంత దురదృష్టవంతుడంటే..ప్రభాస్ సినిమా లో ఆఫర్ వచ్చినా చేయలేకపోయాడు..ఆ సినిమా ఇదే..!!

దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకెళ్లి పోతూ ఉంటారు ..అని మన ఇంట్లోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. బహుశా అది తారకరత్న విషయంలో నిజమే అనిపిస్తుంది . లేకపోతే ఎటువంటి తప్పు చేయని తారకరత్న ఇంత చిన్న వయసులో ప్రేమించే భార్య ..ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడే పిల్లలను దూరం చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఎంత అన్యాయం. దేవుడు ఉన్నాడా..? లేడా..? అని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తూ ఉంటుంది. కాగా గుండె నొప్పి కారణంగా తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ మరణించిన విషయం తెలిసిందే.

ఆయన మరణ వార్త సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నింపేసింది . కాగా తారకరత్న మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోనే ఆయనకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ హీరో ప్రభాస్ సినిమాలో .. నటించే ఆఫర్ వచ్చినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుకే సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తున్నాడు . అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తారకరత్నను సెలెక్ట్ చేసుకున్నారట డైరెక్టర్.

కాగా ఇప్పటికే ఆయన కి స్టోరీ చెప్పగా.. పాత్ర బాగా నచ్చేయడంతో..ఓకే చేసారట. కొన్ని రోజుల్లోనే అఫియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇదివరకే ఆయన పాత్రను తారకరత్నకు వినిపించగా స్టోరీ చాలా బాగుందని కచ్చితంగా సినిమా చేస్తారని మాట ఇచ్చారట . అయితే ఆ సినిమాలో నటించకుండానే దేవుడు ఆయనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళిపోయాడు . ఈ విషయం తెలుసుకున్న తారకరత్న ఫ్యాన్స్ కన్నీరు విలపిస్తున్నారు . అంతేకాదు మరో మూడు నాలుగు సినిమాల్లో కూడా తారకరత్న ఇంపార్టెంట్ పాత్రలో కనిపించాల్సి ఉంది . కానీ ఆయన ఆ అదృష్టం కి నోచుకోకుండానే లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఏది ఏమైనా తారకరత్న మన మధ్య లేడు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటేనే మన కళ్ళల్లో మనకు తెలియకుండానే నీళ్లు తిరిగిపోతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news