MoviesMrunal Takur హవ్వ..కాబోయే మొగుడు పై మృణాల్ నాటీ కామెంట్స్.. పాప...

Mrunal Takur హవ్వ..కాబోయే మొగుడు పై మృణాల్ నాటీ కామెంట్స్.. పాప మంచి మూడ్ లో ఉందే..!!

మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . గతంలో అంటే మృణాలు పేరుకు పెద్ద స్టోరీనే చెప్పాల్సి వచ్చేది .. కానీ సీతారామం సినిమా రిలీజ్ అయిన తర్వాత మణాల్ పేరు అందరికీ విపరీతంగా నోటిడ్ అయిపోయింది . మరీ ముఖ్యంగా మృణాల్ ఇప్పుడు మృణాల్ కంటే కూడా సీతా అనే పేరుతోనే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటున్నారు జనాలు . దానికి మెయిన్ రీజన్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలో ఆమె పాత్ర పేరు సీత.

ఆ పాత్రతో జనాల మదిలో చెరగని ముద్రను వేయించుకునింది ఈ మృణాల్ టాకూర్. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసినప్పటికీ.. సీరియల్స్ లో నటించినప్పటికీ రాని గుర్తింపు సీతారామం సినిమాతో తెచ్చుకునింది . ఈ క్రమంలోనే గతంలో మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా మృణాల్ సోషల్ మీడియాలో అభిమానులతో ..”నాకు కాబోయే భర్త అందంగా ఉండక్కర్లేదని మంచి మనసుంటే చాలు అని చెప్పుకొచ్చింది”.

అయితే గతంలో కపిల్ శర్మ షో లో..”తన కాబోయే భర్త చాలా అందంగా ఉండాలని చెప్పకు వచ్చింది”. ఇదే పాయింట్ ని పట్టేసిన ట్రోలర్స్ ఆమెని ట్రోల్ చేస్తున్నారు . అయితే ఓ నెటిజన్ ఏకంగా అబద్దానికి మారుపేరు మృణాల్ అంటూ మీమ్ క్రియేట్ చేసి ట్రోల్ చేసాడు. దీని పై ఫైర్ అయిన మృణాల్”నాకు అప్పుడు అలా అనిపించింది అందుకే అలా చెప్పాను.. ఇప్పుడు ఇలా అనిపిస్తుంది అందుకే ఇలా చెప్తున్నాను.. రేపటి రోజు ఏమనిపిస్తే అదే చెప్తా “అంటూ ఘాటుగా స్పందించింది . ఈ క్రమంలోనే మృణాల్ పాప మంచి స్పీడ్ మీద ఉంది అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news