MoviesVijay Sethupathi"పబ్లిక్ లో అలాంటి పనులా".. విజయ్ సేతుపతికి గూబ గుయ్యమనే...

Vijay Sethupathi”పబ్లిక్ లో అలాంటి పనులా”.. విజయ్ సేతుపతికి గూబ గుయ్యమనే షాకిచ్చిన కోర్టు..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొందరు స్టార్ హీరో లు సెలబ్రిటీ హోదా రాగానే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నారు . అయితే తాజాగా అలాంటి బిహేవియర్ కారణంగానే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి .. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్నాడు . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే విజయ్ సేతుపతి సినిమా తీస్తే ఆ సినిమా మినిమం హిట్గా టాక్ సంపాదించుకుంటుంది . తనదైన స్టైల్ లో నటిస్తూ హీరోగా , తండ్రిగా , హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటిస్తూ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చూసుకుంటున్న విజయ్ సేతుపతి నీ రెండేళ్ల నుంచి ఓ వివాదం వెంటాడుతూ వస్తుంది.

రెండేళ్ల క్రితం విజయసేతుపతి బెంగళూరు విమానం విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవపడ్డాడు . దీనికి సంబంధించి అప్పట్లో హాట్ టాపిక్ గా వార్తలు వినిపించాయి . తనపై విజయ్ సేతుపతి ఆయన మనుషులు దాడి చేశారు అంటూ కోర్టులో కేసు నమోదు చేశారు మహా గాంధీ . కాగా ఈ కేసు పై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా సుప్రీంకోర్టు విజయ్ సేతుపతికి వార్నింగ్ ఇచ్చింది. ” సెలబ్రిటీ హోదాలో ఉన్న మీరు పబ్లిక్ లో ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు ” అంటూ చురకలంటించారు.

ప్రజల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన అదుపులో ఉండేలా చూసుకోవాలని.. సెలబ్రిటీ హోదాలో ఉన్న మీకు అది మినిమం కామన్ సెన్స్ “అంటూ గుర్తు చేసింది కోర్టు. కాగా ఈ విషయంలో సుప్రీం కోర్టు.. విజయ్ – మహాగాంధీలను ఒక్కచోట కూర్చోపెట్టి మాట్లాడి పరిస్థితిని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్లకు గాని ఇష్టమే అయితే తమ సమాధానం చెప్పేందుకు ఇద్దరు తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతిని సోషల్ మీడియాలో పలువురు జనాలు ట్రోల్ చేస్తున్నారు . స్టార్ సెలబ్రిటీస్ గా ఉన్న నువ్వు ఇలాంటి బిహేవియర్ ఎలా చేయగలవు అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news