Moviesఅప్పుడే ఈ హీరో కు బాగా ఎక్కేసిందే..? స్టార్ కిడ్స్ ని...

అప్పుడే ఈ హీరో కు బాగా ఎక్కేసిందే..? స్టార్ కిడ్స్ ని అంత మాట అనేసాడు ఏంట్రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న కుర్ర హీరోలు హద్దులు మీరి మాట్లాడుతున్నారా అంటే ..అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎంతోమంది కుర్ర హీరోలు ఎంట్రీ ఇచ్చారు.. వాళ్ళల్లో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు . వాళ్లల్లో ఒక్కరే ఈ కిరణ్ అబ్బవరం. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇందస్ట్రీలోకి వచ్చి.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పోటి ఇస్తున్నాడు.

కాగా రీసెంట్ గా ఆయన నటించిన సినిమా ” వినరో భాగ్యము విష్ణు కథ “. మాహా శివరాత్రి సంధర్భంగా ఫిబ్రవరి 18 న ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. కాశ్మీరీ పరదేశి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కింది. మురళీ కిషోర్ డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయమైన ఈ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది.

ఈ క్రమంలోనే వినరో భాగ్యము విష్ణు కధ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ లో కిరణ అబ్బవరం స్టేజిపై మాట్లాడిన మాటలు జనాలకు కొంచెం ఓవరాక్షన్ గా అనిపించాయి . “సినిమా హిట్ చేసినందుకు థాంక్స్.. మీరు ఇచ్చిన రిజల్ట్ ను నేను ఎప్పుడు స్వాగతిస్తాను.. అంటూ చెబుతూనే ..కొంచెం హెడ్ వెయిట్ గా మాట్లాడినట్లు అనిపించింది . సోషల్ మీడియాలో కొంత మంది బ్యాచ్ తయారై తన మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ తొక్కే ప్రయత్నం చేస్తున్నార‌ని, కానీ ఎంత‌ ట్రోల్ చేసినా భ‌య‌ప‌డేది లేదు అంటూ కిర‌ణ్ చెప్పుకొచ్చాడు. త‌న‌ను ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్లు సపోర్ట్ చేస్తున్నారని ..ఇక నెపొటిజం ఎక్కడ ఉందని ప్రశ్నించారు..”. ఈ క్రమంలోని కిరణ్ అబ్బవరం కి హెడ్ వెయిట్ పెరిగిందని .. నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయితే కుర్రాడు కరెక్ట్ పొజిషన్లోకి వస్తారు అంటూ పలువురు జనాలు ఆయనను ట్రోల్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news