MoviesStar Heroine ఈ ఫొటోలో స్టార్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… తెలుగులో...

Star Heroine ఈ ఫొటోలో స్టార్ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… తెలుగులో టాప్ హీరోయిన్‌…!

ప్రస్తుతం సినిమా రంగంలో సెలబ్రిటీలుగా ఉన్న వారంతా తమ చిన్నప్పటి జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం నడుస్తోంది అంతా సోషల్ మీడియా యుగం కావడంతో ఒక్కొక్కరికి లక్షలు… మిలియ‌న్ల‌లో ఫారోవర్లు ఉంటున్నారు. దీంతో వారి చిన్నప్పటి లేదా పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏ ఒక్క విషయాన్ని లేదా ఏ ఒక్క ఫోటో షేర్ చేసుకున్నా అది నిమిషాల్లోనే ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇటు కావలసినంత పబ్లిసిటీతో పాటు సోషల్ మీడియా ద్వారా ఆదాయం కూడా వస్తూ ఉండడంతో వాళ్లకు రెండు రకాలుగా హెల్ప్ అవుతుంది.

తాజాగా పై ఫోటోలో మీరు చూసిన అమ్మాయి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న స్టార్ హీరోయిన్. చిన్నప్పుడు స్టిల్స్ చూస్తుంటే ఎంత క్యూట్‌గా.. ఎంతో ముద్దుగా ఉందో కనిపిస్తోంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదు… మీరు గుర్తుపట్టారా తెలుగులో వరుస సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఆమె తెలుగులో ఇప్పటివరకు చేసింది మూడు సినిమాలే. అయినా అపరిమితమైన క్రేజీ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ధనుష్ కు జోడిగా తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కిన సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో పవన్ కళ్యాణ్ – ద‌గ్గుబాటి రానా నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్ సినిమాతో తొలిసారిగా వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే చక్కటి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసారా సినిమాలోని నటించింది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు సంయుక్తకు మంచి పేరు తీసుకువచ్చింది.

ఇక బైలింగ్వుల్ మూవీ సార్ సినిమాలో మీనాక్షి అనే జువాలజీ లెక్చరర్ పాత్రలో మంచి స్క్రీన్ ప్రజెన్స్‌ సొంతం చేసుకుంది. దీనికి తోడు ప్రమోషన్లకు ముందే సంయుక్త సోషల్ మీడియాలో తన ఇంటిపేరు తొలగించుకోవడం కూడా టాప్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చెక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో మరో మూడు నాలుగు మంచి అవకాశాలు సంయుక్త‌ సొంతం చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news