MoviesMahesh-JR NTR మ‌హేష్ - తార‌క్ కెరీర్‌లో ఈ విచిత్రం చూశారా…...

Mahesh-JR NTR మ‌హేష్ – తార‌క్ కెరీర్‌లో ఈ విచిత్రం చూశారా… ఇన్నేళ్ల‌కు ఇలా…!


ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒకరు ఒకరిని ఫాలో అయితే.. తర్వాత తాను ఫాలో అవ్వని వారితోనే ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సినిమా రంగంలో హీరోలు – హీరోయిన్ల సెంటిమెంట్లు, హీరోలు – దర్శకుల సెంటిమెంట్లు అలాగే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక చిత్ర విచిత్రం జరుగుతోంది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు.

అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరో అయినా ఆ తర్వాత విజయాలు ఎన్టీఆర్‌ను తిరుగులేని స్టార్ హీరోగా నిలబెట్టాయి. కెరీర్ ఆరంభం నుంచి చూస్తే ఎన్టీఆర్ రాజమౌళితో ఎక్కువ సినిమాలు చేశారు. అలాగే వినాయక్ తోను మూడు సినిమాలలో నటించాడు.

ఎన్టీఆర్ రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ వన్ – సింహాద్రి – యమదొంగ‌.. తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలు చేసి నాలుగూ సూప‌ర్ హిట్లు కొట్టాడు. ఎన్టీఆర్ ఎక్కువగా రాజమౌళి వినాయక్‌తో సినిమాలు చేస్తున్నప్పుడు మహేష్ ఈ ఇద్దరు డైరెక్టర్లతోనూ సినిమాలు చేయలేదు. ఇంకా చెప్పాలంటే టైం కలిసి రాలేదు. మహేష్ బాబు త్రివిక్రమ్‌తో ఖ‌లేజా – అతడు సినిమాలలో నటించాడు. ఆ రెండు సినిమాలు మ‌హేష్‌కు మంచి పేరు తెచ్చాయి.

ఆ తర్వాత కొరటాల శివతో శ్రీమంతుడు – భరత్ అనే నేను రెండు సినిమాలు చేసి రెండు సూపర్ హిట్లు కొట్టాడు. అలా చూస్తే ఎన్టీఆర్ ఎక్కువగా ట్రావెల్ అయిన దర్శకులతో మహేష్ సినిమాలు చేయలేదు. మహేష్ ఎక్కువగా ట్రావెల్ అయిన త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి వారితో ఎన్టీఆర్ అరవింద సమేత – జనతా గ్యారేజ్ ఇలా ఒక్క సినిమా మాత్రమే చేసి హిట్ కొట్టాడు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కు సూపర్ హిట్లు ఇచ్చిన రాజమౌళితో మహేష్ కమిట్‌ అయ్యాడు. ప్రస్తుతం మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్… మహేష్‌కు రెండు సూపర్ హిట్ లు ఇచ్చిన కొరటాల శివతో కమిట్ అయ్యాడు. అలా వీరిద్దరిలో చిత్రమైన సంఘటనలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఏదేమైనా ఇద్దరు తమ కేరీర్‌ను చక్కగా ప్లానింగ్ చేసుకుంటూ సూపర్ హిట్లు కొడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news