Moviesప్రియమణిని ఆ స్టార్ ప్రొడ్యూసర్ బలవంతం చేశాడా.. డబ్బులు ఇస్తానంటూ..?

ప్రియమణిని ఆ స్టార్ ప్రొడ్యూసర్ బలవంతం చేశాడా.. డబ్బులు ఇస్తానంటూ..?

కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియమణి ప్రస్తుతం ఎక్కువగా ఆఫర్లు లేక కెరీర్ విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. పెళ్లి తర్వాత పలు వివాదాలలో చిక్కుకోవడం కూడా ప్రియమణికి ఆఫర్లు తగ్గడానికి కారణం అని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. కొన్ని రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన ప్రియమణికి ఆ ఆఫర్లు కూడా తగ్గాయి.

అయితే ప్రియమణి కెరీర్ లో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలలో ద్రోణ సినిమా కూడా ఒకటి. నితిన్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా ప్రియమణికి గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు దమ్మలపాటి శ్రీనివాసరావు నిర్మాత కాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన షాకింగ్ సీక్రెట్లను బయటపెట్టారు.

అయితే ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ప్రియమణి స్విమ్ సూట్ వేసుకోవాలని దర్శకుడు, నిర్మాత బలవంతపెట్టారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. నిర్మాత ఎక్కువ డబ్బులు ఆఫర్ చేశాడని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తల గురించి నిర్మాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రియమణి స్విమ్ సూట్ ధరించడం వెనుక పెద్ద కథ ఉందని అన్నారు.

దర్శకుడు ప్రియమణికి స్విమ్ సూట్ వేసుకుని సాంగ్ లో డాన్స్ చేయాలని కోరగా మొదట ఆ అమ్మాయి 5 నిమిషాల సమయం అడిగి ఆ తర్వాత ఒప్పుకుందని నిర్మాత తెలిపారు. ఆ సమయంలో ప్రియమణి నా దగ్గర డబ్బులు గుంజిందని కూడా ప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఆమెను మేము బలవంతపెట్టలేదని నిర్మాత చెప్పుకొచ్చారు. ద్రోణ సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయని నిర్మాత వెల్లడించడం గమనార్హం. బయట ఎన్నో గాసిప్స్ ప్రచారంలోకి వస్తుంటాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని దమ్మలపాటి శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news