Moviesడ‌బ్బింగ్ రూమ్‌లో సింగ‌ర్ సునీత‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన స్టార్ డైరెక్ట‌ర్..!

డ‌బ్బింగ్ రూమ్‌లో సింగ‌ర్ సునీత‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన స్టార్ డైరెక్ట‌ర్..!

సింగర్ సునీత టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి సునీత టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను సునీత అభిమానులను సంపాదించుకున్నారు. చాలా చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకుని ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తల్లి అయిన సునీత త‌ర్వాత భ‌ర్త‌తో విబేధాలు రావ‌డంతో విడిపోయింది. ఇక లేటు వయసులో మ్యాంగో రామ్ ను రెండో వివాహం చేసుకుని సునీత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినిమాలకు పాటలు పాడటంతో పాటు సింగింగ్ రియాలిటీ షోలకు సునీత జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ డైరెక్టర్ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని సునీత వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం… ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన తనను డైరెక్టర్ ఇబ్బంది పెట్టాడని ఆమె ఓ సంద‌ర్భంలో తెలిపారు. తాను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు సింపుల్ గా వెళతానని అన్నారు.

స్టూడియోలో అడుగు పెట్టగానే ఆ సినిమా డైరెక్టర్ హలో మేడమ్ అంటూ తనను రిసీవ్ చేసుకున్నాడని అన్నారు. నేను మీకు పెద్ద అభిమాని అంటూ చెప్పుకొచ్చాడని తెలిపారు. పరిచయాలు పూర్తయ్యాక కాసేపు బానే మాట్లాడాడని కానీ ఉన్నట్టుండి వెంటనే తనను సునీత అని పిలవడం ప్రారంభించాడని తెలిపారు. ఆ తర్వాత కొన్ని డబ్బింగ్ సెషన్స్ ముగిశాక అతని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ప్రయత్నించాడని చెప్పారు. అంతేకాకుండా మేడమ్ అని పిలుస్తూనే మధ్య మధ్యలో బుజ్జి… అరేయ్… కన్నా అంటూ పిలవడం మొదలు పెట్టాడని చెప్పారు.

అసలు అతని ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యపోయానని అన్నారు. మేడమ్ అని పిలుస్తూ మధ్య మధ్యలో బుజ్జీ, కన్నా అంటూ పిలవడంతో షాక్ అయ్యానని అన్నారు. అతని అసలు ఉద్దేశం ఏంటో అర్థం అయిన తర్వాత చిరాగ్గా అనిపించింది అని అన్నారు. దాంతో అక్కడనుండి వెళ్లిపోయానని తెలిపారు. ఇక అదృష్టం కొద్దీ మళ్లీ ఆ డైరెక్టర్ ను కలవలేదని చెప్పారు. అయితే తనను ఇబ్బంది పెట్టిన డైరెక్టర్ పేరు మాత్రం సునీత బయట పెట్టలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news