Moviesసుడిగాలి సుధీర్ కు ఇంత హెడ్ వెయిటా..? మరీ టూ...

సుడిగాలి సుధీర్ కు ఇంత హెడ్ వెయిటా..? మరీ టూ మచ్ చేస్తున్నాడుగా..!!

సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరు గెస్ చేయలేరు . తిమ్మిరి బమ్మిరి చేసి టాలెంట్ ఉన్న స్టార్స్ ఎంతోమంది ఉన్నా ఈ రంగుల మాయా ప్రపంచంలో కళ్ళముందే మాయ జరిగిపోతూ ఉంటుంది. కాగా బుల్లితెరపై కూడా అలాంటి మాయలకు బలైన స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . అదే లిస్టులోకి యాడ్ అవుతాడు సుడిగాలి సుధీర్ . సామాన్యుడిగా ఉన్న ఇతనిని ఈటీవీ జబర్దస్త్ మేనేజ్మెంట్ పిలిచి అవకాశం ఇచ్చి ..తనలోని టాలెంట్ నలుగురికి పరిచయం చేసింది . అంతేకాదు ఒకప్పుడు ఫుడ్ లేక అల్లాడిన సుధీర్ ఇప్పుడు కారు బంగ్లాలు కొనుక్కొని జల్సా చేస్తున్నాడు.

అఫ్ కోర్స్ సుధీర్ ర్ లో టాలెంట్ లేకపోతే జబర్దస్త్ అతనికి అవకాశం ఇచ్చేది కాదు. కానీ సుధీర్ లో టాలెంట్ ఉన్న అవకాశాలు ఇవ్వడానికి ఎవరు రెడీగా లేని టైంలో జబర్దస్త్ సుధీర్ ని నమ్మి అవకాశం ఇచ్చింది. అలాంటి షోకే పగనామం పెట్టాడు సుధీర్ అంటూ ఈ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి . ఆయన రీసెంట్ గా నటించిన గాలోడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే అతనికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు మల్లెమాలను దూరం పెట్టిన సుధీర్ ..ఇప్పుడు ఆ షో లో కనిపించడానికి ట్రై చేస్తున్నాడట .

అయితే ఆయనని వెనక్కి తీసుకురావడానికి షో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా సుధీర్ ఒకానొక టైం లో మల్లెమాల మేనేజ్మెంట్ కాల్ చేసిన కానీ లిఫ్ట్ చేయకుండా చాలా టార్చర్ చేశాడని ..ఈ క్రమంలోని సుధీర్ బిహేవియర్ తో విరక్తి చెందిన మల్లెమాల.. అతగాడిని తిరిగి షోకి ఆహ్వానించేది లేదంటూ తెగేసి చెప్పిందట . ఏది ఏమైనా సరే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న సుడిగాలి సుధీర్ పై ఇలాంటి రూమర్ రావడం నిజంగా షాకింగ్ గానే ఉంది . కానీ సుధీర్ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ వెండితెరపై జరుగుతున్న మాయలకు బలైపోయారు ..సుధీర్ ఆ మాయలకు బలి అవకుండా ఉంటే చాలు అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news