Moviesవీర‌సింహారెడ్డిలో శృతీహాస‌న్ రోల్‌పై అదిరిపోయే ట్విస్ట్ ఇదే...!

వీర‌సింహారెడ్డిలో శృతీహాస‌న్ రోల్‌పై అదిరిపోయే ట్విస్ట్ ఇదే…!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో హీరోయిన్ శృతీహాస‌న్‌. బాల‌య్య – శృతి కాంబినేష‌న్ల ఇదే ఫ‌స్ట్ సినిమా. ఇప్ప‌టికే రిలీజ్ అయిన స్టిల్స్‌తో పాటు, సాంగ్స్‌లో వీరిద్ద‌రి డ్యాన్స్ చూసిన వాళ్లంతా బాల‌య్య – శృతి జోడీ ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యింద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శృతి రోల్ గురించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చిది. ఈ సినిమాలో శృతీ హాస‌న్ స్కూల్ టీచ‌ర్‌గా క‌నిపించ‌బోతోంద‌ట‌. రాయ‌ల‌సీమ‌లో వెన‌క‌బ‌డిన ఓ గ్రామంలో అక్క‌డ ఫ్యాక్ష‌న్‌తో నాశ‌న‌మైన కుటుంబాల పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పే టీచ‌ర్‌గా ఆమె రోల్ ఉండ‌బోతోంది. అయితే ఆమె పాత్ర‌పై ఇంట‌ర్వెల్‌కు అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంద‌ట‌.

ఓవ‌రాల్‌గా సినిమాలో శృతీహాస‌న్ పాత్ర చాలా కీల‌కం అంటున్నారు. సినిమాలో ఆమె పాత్ర కామిక్ యాంగిల్ లో ఉంటుందంటున్నారు. ఇక సినిమాలో ఇంట‌ర్వెల్‌కు ముందు ఓ అదిరిపోయే సాంగ్ ఫిక్స్ చేశాడ‌ట ద‌ర్శ‌కుడు. అక్క‌డే బాల‌య్య – శృతి క్యారెక్ట‌ర్ల‌కు సంబంధించి ఇంట్ర‌స్టింగ్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందంటున్నారు.

వీరిద్ద‌రి క్యారెక్ట‌ర్ల లింక‌ప్‌పై వ‌చ్చే ట్విస్ట్ కూడా చాలా ఎమోష‌న‌ల్‌గా ఉండ‌బోతోందంటున్నారు. ఇక థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండ‌గా, డాన్ శీను – బలుపు – పండగ చేస్కో సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మ‌లినేని గోపీచంద్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌న‌వ‌రి 12న వీర‌సింహారెడ్డి రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news