Moviesఆ హీరోయిన్‌తో ఎఫైర్ వల్లే సమీర్‌ను ఈటివి నుంచి గెంటేశారా...? అసలేం...

ఆ హీరోయిన్‌తో ఎఫైర్ వల్లే సమీర్‌ను ఈటివి నుంచి గెంటేశారా…? అసలేం జరిగింది…!

టాలీవుడ్ న‌టుడు స‌మీర్ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల‌లో స‌మీర్ ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించాడు. హీరోకి ఫ్రెండ్ గా…విల‌న్ గా, అన్న‌గా ఇలా చాలా ర‌కాల పాత్ర‌ల‌లో న‌టించాడు. కేవ‌లం పాజిటివ్ రోల్స్ లోనే కాకుండా నెగిటివ్ రోల్స్ చేసి కూడా మెప్పించాడు. అంతే కాకుండా బిగ్ బాస్ మొద‌టి సీజ‌న్ లో ఎంట్రీ ఇచ్చి చాలా మంది మ‌న‌సు దోచుకున్నాడు. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న స‌మీర్ ఒక‌ప్పుడు టీవీ సీరియ‌ల్స్ లో న‌టించాడు.

టీవీ సీరియ‌ల్స్ తోనే త‌న కెరీర్ ప్రారంభించాడు. అంతే కాకుండా అప్ప‌ట్లో ఈటీవీ సీరియ‌ల్స్ లో న‌టించి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అయితే సమీర్ ను స‌డెన్ గా ఈటీవీ సీరియ‌ల్స్ నుంచి తప్పించారు. అంతే కాకుండా ఓ సీరియ‌ల్ హీరోయిన్ తో షూటింగ్ స్పాట్ లోనే రొమాన్స్ చేయ‌డం వ‌ల్ల స‌మీర్ ను సీరియ‌ల్స్ నుంచి తప్పించార‌ని… అంతే కాకుండా ఈటీవీ నుండే అత‌డిని బ్యాన్ చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆ వార్త‌లపై స‌మీర్ క్లారిటీ ఇచ్చాడు. అస‌లు ఆ రోజు ఏం జ‌రిగిందో చెప్పాడు. స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈటీవీలో నా మొగుడు నాకే సొంతం అనే సీరియ‌ల్ వచ్చేది. అప్ప‌ట్లో ఈ సీరియ‌ల్ ఓ సెన్సేష‌న‌ల్. అలాంటి సీరియ‌ల్ నుంచి స‌మీర్ ను ఉన్న‌ట్టుండి తీసేసి రెమ్యున‌రేషన్ కూడా ఇవ్వ‌లేదు. నా మొగుడు నాకు సొంతం సీరియల్ హీరోయిన్ తో స‌మీర్ కు ఎఫైర్ ఉంద‌ని షూటింగ్ సెట్ లోనే రొమాన్స్ చేస్తున్నార‌ని సుమ‌న్ సీరియ‌ల్ నుండి తప్పించార‌ట‌.

అయితే ఎవ‌రో చెప్పిన విష‌యాలు విని సుమ‌న్ అలా చేశార‌ని స‌మీర్ చెబుతున్నాడు. అంతే కాకుండా సుమ‌న్ కు తాను చాలా క్లోజ్ అని అయినా కానీ అస‌లు ఏం జ‌రిగింది ? అని త‌న‌ను క‌నీసం పిలిచి అడ‌గ‌కుండా సీరియ‌ల్ నుండి తొల‌గించార‌ని సమీర్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కానీ ఆ సీరియ‌ల్ నుంచి తీసేయ‌డం వ‌ల్ల త‌న‌కు మంచి జ‌రిగిందని సినిమా ఆఫ‌ర్ లు వెతుక్కుంటూ వ‌చ్చాయ‌ని ఆనందం వ్య‌క్తం చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news