Moviesఅస‌లు మ‌జా అంటే ఇది... అక్క‌డ వీర‌య్య‌ది పైచేయి... ఇక్క‌డ వీర‌సింహుడిది...

అస‌లు మ‌జా అంటే ఇది… అక్క‌డ వీర‌య్య‌ది పైచేయి… ఇక్క‌డ వీర‌సింహుడిది డామినేష‌న్‌…!

వ‌చ్చే సంక్రాంతి పోటీ మ‌జా మామూలుగా లేదు. ఐదేళ్ల త‌ర్వాత టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ పోటీ ప‌డుతున్నారు. మ‌ధ్య‌లో దిల్ రాజు నిర్మిస్తోన్న వార‌సుడు సినిమా ఉంది. ఇదిరాజు సొంత సినిమా కావ‌డంతో పాటు బైలింగ్వుల్ మూవీ కావ‌డం.. భారీ బ‌డ్జెట్‌తో వ‌స్తుండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీంతో రాజు సొంత థియేట‌ర్ల‌లో మెజార్టీ థియేట‌ర్లు, టాప్ థియేట‌ర్లు అన్నీ కూడా ఏపీ, తెలంగాణ‌లో వార‌సుడికే వెళ్ల‌నున్నాయ‌న్న‌ది క‌న్‌ఫార్మ్ అయ్యింది.

థియేట‌ర్ల విష‌యంలో ఇప్పుడు ఈ మూడు సినిమాల మ‌ధ్య పెద్ద వార్ నడుస్తోంది. మ‌రో వైపు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండు సినిమాలు ఒకే బ్యాన‌ర్‌లో వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాలు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోన్న మైత్రీ మూవీస్ నైజాంలో ఓన్ డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ ఓపెన్ చేయ‌డంతో పోటీ మ‌రింత ర‌స‌వత్త‌రంగా మారింది. ఇటు నైజాం డిస్ట్రిబ్యూష‌న్ దిల్ రాజుకు కంచుకోట‌.

ఉత్త‌రాంధ్ర‌లో కూడా మంచి థియేట‌ర్లు వార‌సుడి ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. ఆ త‌ర్వాత మిగిలిన థియేట‌ర్ల‌నే బాల‌య్య‌, చిరు సినిమాలు పంచుకోవాల్సి వ‌స్తోంది. ఇక సీడెడ్‌, ఆంధ్రా, నైజాంలో ఈ రెండు సినిమాల ప్రి రిలీజ్ బ‌జ్ చూస్తే నైజాంలో వార‌సుడు త‌ర్వాత వాల్తేరు వీర‌య్య‌కు కాస్త ఎక్కువ రేట్లు ప‌ల‌క‌డంతో పాటు అడ్వాన్స్‌లు వ‌స్తున్నాయి. ఖ‌మ్మం, గ్రేట‌ర్ హైద‌రాబాద్ లాంటి చోట్ల మాత్రం బాల‌య్య సినిమాల‌కు కాస్త ఎక్క‌వ డామినేష‌న్ క‌నిపిస్తోంది.

ఓవ‌రాల్‌గా నైజాంలో వీర‌సింహారెడ్డి కంటే వాల్తేరు వీర‌య్యకు కాస్త ఎక్కువ బ‌జ్ ఉంది. ఇక సీడెడ్‌లో బాల‌య్య వీర‌సింహ ముందు వీర‌య్య వెనుకంజ‌లోనే ఉంది. ఇక్క‌డ బాల‌య్య డామినేష‌న్ మామూలుగా లేదు. సింగిల్ స్క్రీన్ ఉన్న చోట్ల వీర‌య్య సినిమా వేసేకంటే వీర‌సింహారెడ్డి సినిమాయే వేస్తామ‌ని థియేట‌ర్ల యాజ‌మానుల‌తో పాటు ఎగ్జిబిట‌ర్లు ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. లేక‌పోతే రెండు షోల చొప్పున పంచుకోవాల్సి ఉంటుంది. అయినా కూడా సీడెడ్‌లో బాల‌య్య సినిమా జోరు చాలా ఎక్కువుగా ఉంది.

ఇక ఆంధ్రాలో వీర‌య్య వ‌ర్సెస్ వీర‌సింహారెడ్డి మ‌ధ్య కూడా థియేట‌ర్ల కోసం గ‌ట్టి పోటీ ఉంది. కృష్ణాలో రెండు సినిమాల మ‌ధ్య గట్టి పోటీ ఉంటే గుంటూరు, ప్ర‌కాశంలో బాల‌య్య సినిమా డామినేష‌న్ ఉంది. గోదావ‌రి జిల్లాల్లో చిరు వీర‌య్యకు ఒక‌టి, రెండు స్క్రీన్లు ఎక్కువుగా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఉత్త‌రాంధ్ర‌లోనూ ఒక‌టి, రెండు స్క్రీన్లు అటూ ఇటూగా రెండు సినిమాల‌కు స‌మానంగా స్క్రీన్లు ఇస్తున్నారు. ఏదేమైనా రెండు సినిమాల మ‌ధ్య పోటీ మ‌జా మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news