Moviesబాల‌య్య - చిరు ఫ్యాన్స్ మ‌ధ్య పెద్ద చిచ్చు ర‌గిల్చిన శృతీహాస‌న్‌......

బాల‌య్య – చిరు ఫ్యాన్స్ మ‌ధ్య పెద్ద చిచ్చు ర‌గిల్చిన శృతీహాస‌న్‌… కొత్త గొడ‌వ మొద‌లైంది…!

వామ్మో సంక్రాంతి రేసులో పోటీలో ఉన్న స్టార్ హీరోలు చిరంజీవి, బాల‌య్య సినిమాల సంగ‌తేమో గాని.. ఇప్ప‌టి నుంచే రెండు కాంపౌండ్‌ల‌కు చెందిన హీరోల అభిమానుల మ‌ధ్య మాత్రం ర‌చ్చ రంబోలా అయిపోతోంది. ఇద్ద‌రు హీరోల అభిమానుల్లో ఎవ్వ‌రూ వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. మా హీరో సినిమా గొప్పంటే.. మాదే గొప్పంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నానార‌చ్చ చేస్తున్నారు. ఇటీవ‌ల రెండు సినిమాల ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండిటిని కంపేరిజ‌న్ చేస్తూ పెద్ద వార్ న‌డిచింది.

ఇక టైటిల్స్ విష‌యంలోనూ, గ్లింప్స్ విష‌యంలోనూ ఇదే తంతు..! రీసెంట్‌గా ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అయితే ఇద్ద‌రు హీరోల అభిమానులు కూడా త‌మ హీరో సాంగే బాగుందంటూ సోష‌ల్ మీడియాను షేక్ చేశారు. రెండు సాంగ్స్ కాపీ అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఫ్యాన్స్ మాత్రం అదిరిపోయే వ్యూస్‌తో గ్లింప్స్ రికార్డులు షేక్ చేసేలా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోన్న శృతీహ‌స‌న్ కూడా ఈ ఇద్ద‌రు హీరోల అభిమానుల మ‌ధ్య పెద్ద చిచ్చు పెట్టిన‌ట్ల‌య్యింది.

అస‌లు శృతీ వ‌రుస ప్లాపుల‌తో రేసులో వెన‌క‌ప‌డిపోయింది. అయితే క్రాక్‌తో ఫామ్‌లోకి వ‌చ్చిన ఆమెకు వ‌కీల్‌సాబ్ సినిమా చేసినా పెద్ద గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల సినిమాల్లో ఒకేసారి న‌టించ‌డం.. అందులోనూ ఈ రెండూ సంక్రాంతికి పోటీ ప‌డుతుండ‌డంతో స‌హ‌జంగానే శృతి సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యింది. చిరు, బాల‌య్య ఫ్యాన్స్ మాత్రం శృతి త‌మ హీరోకే ప‌ర్‌ఫెక్ట్ మ్యాచ్ అని.. త‌మ హీరో సినిమాతోనే ఆమె పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు.. మ‌రింత గుర్తింపు వ‌స్తుందంటూ కొత్త వార్‌కు తెర‌లేపారు.

ఈ రెండు సినిమాల్లోనూ శృతి 30 + ఏజ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌రి ఈ రెండు సినిమాల్లో ఏ పాత్ర‌లో శృతి ఇర‌గ‌దీస్తుంది.. ఏ సినిమాలో ఆమె పాత్ర హైలెట్ అవుతుంది… ఏ సినిమాతో మంచి గుర్తింపు వ‌స్తుంద‌న్న దానిపై చిరు, బాల‌య్య అభిమానుల కామెంట్ల యుద్ధం ఎలా ? ఉన్నా సినిమాలు రిలీజ్ అయ్యాక కాని ఆమె ఎవ‌రికి ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యిందో తెలియ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news