Moviesఆ ఒక్క‌ విష‌యంలో మాత్రం మ‌హేష్‌తో గొడ‌వ‌లే... ఇంట్లో సీక్రెట్లు బ‌య‌ట...

ఆ ఒక్క‌ విష‌యంలో మాత్రం మ‌హేష్‌తో గొడ‌వ‌లే… ఇంట్లో సీక్రెట్లు బ‌య‌ట పెట్టేసిన న‌మ్ర‌త‌..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారి వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్… ప్రస్తుతం తన 28వ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అతడు ఖలేజా లాంటి సినిమాల తర్వాత త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇదే.

2010లో వ‌చ్చిన ఖ‌లేజా త‌ర్వాత 12 ఏళ్ల‌కు మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో టాలీవుడ్ సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే మహేష్ జీవితంలో ఈ ఏడాది వ్యక్తిగతంగా తీరని లోటు. మహేష్ తల్లి ఇందిరా దేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో పాటు సాదరుడు రమేష్ బాబు ముగ్గురు మృతి చెందారు. ఒకే ఏడాది తన కుటుంబంలో ముగ్గురును కోల్పోవటం అంటే ఎవరు తీర్చలేని లోటు అని చెప్పాలి. ఇక మహేష్ కు ముందు నుంచి తన భార్య నమ్రత శిరోద్క‌ర్ అండగా ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తోంది.

ఇంకా చెప్పాలంటే మహేష్ కెరీర్ లోకి నమ్రత ఎంటర్ అయ్యాకే చాలా మార్పులు వచ్చాయి. మహేష్ కు తిరుగలేని స్టార్డం వచ్చింది. 2005లో మ‌హేష్ – న‌మ్ర‌త ముంబైలో పెళ్లి చేసుకున్నారు. అంత‌కు నాలుగేళ్ల ముందునుంచే వీరి ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. న‌మ్ర‌త తాజాగా ఓ మీడిచా ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. మ‌హేష్ ముందునుంచి త‌న‌కు ఓ మంచి ఫ్రెండ్‌లా ఎన్నో విష‌యాల్లో తోడునీడ‌గా వెల్ల‌డించార‌ని.. అలాంటి భ‌ర్త దొర‌క‌డం లైఫ్ లో ఎంతో అదృష్టం అని చెప్పారు.

ఇక త‌న త‌ల్లిదండ్రుల మ‌ర‌ణ స‌మ‌యంలో భ‌ర్త‌గా, స్నేహితుడిగా ఆయ‌న ఎంతో మాన‌సిక స్థైర్యం ఇచ్చాడ‌ని న‌మ్ర‌త మెచ్చుకున్నారు. ఇంట్లో మీ మ‌ధ్య చిన్న‌పాటి గొడ‌వ‌లు వ‌స్తాయా ? అన్న ప్ర‌శ్న‌కు త‌మ ఇంట్లో అలాంటి వివాదాలు ఉండ‌వ‌ని చెప్పేశారు. అయితే పిల్ల‌ల విష‌యంలో మాత్రం చిన్న చిన్న గొడ‌వ‌లు తలెత్తుతాయ‌ని న‌మ్ర‌త స్ప‌ష్టం చేశారు.

త‌మ పిల్ల‌లు సితార, గౌతమ్ ఇద్దరినీ తాను స్ట్రిక్ట్ గా ఉంచితే మహేష్ మాత్రం కాస్త గారం పెట్ట‌డంతో పాటు… వారిని ముద్దుగా చూస్తార‌ని న‌మ్ర‌త స‌ర‌దాగా వెల్ల‌డించారు. ఇక న‌మ్ర‌త ఈ ఎపిసోడ్ ప్రోమో రాగా త్వ‌ర‌లోనే ఫుల్ ఇంట‌ర్వ్యూ రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news