Moviesయాంక‌ర్ అనసూయ చెల్లెలు ఎవ‌రో తెలుసా..? ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

యాంక‌ర్ అనసూయ చెల్లెలు ఎవ‌రో తెలుసా..? ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

సాధార‌ణంగా సెల‌బ్రెటీల ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన విష‌యాల‌ను తెలుసుకోవ‌డానికి నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కాగా తాజాగా యాంక‌ర్ అన‌సూయ చెల్లెలి ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అన‌సూయ చెల్లెలు చూడ్డానికి అచ్చం అన‌సూయ లానే ఉంది. దాంతో అనసూయ చెల్లెలు ఎవ‌రు ఆమె చేస్తున్నారు. అన‌సూయ చెల్లెలి పేరు ఏంటి అని వెత‌క‌డం మొద‌లు పెట్టారు. కాబ‌ట్టి అనసూయ చెల్లెలికి సంబంధించిన విష‌యాల‌ను ఇప్పుడు చూద్దాం.

అచ్చం అన‌సూయ మాదిరిగానే క‌నిపిస్తున్న ఆమె చెల్లెలి పేరు వైష్ణ‌వి. కాగా అన‌సూయ సినిమాల‌లో బిజీ అయిన స‌మ‌యంలో వైష్ణవి ఆమె స్థానాన్ని భ‌ర్తీ చేస్తూ బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఎంట్రీ ఇస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అంతే కాకుండా వైష్ణ‌వి జీ తెలుగులో ప్ర‌సారం కాబోయే రియాలిటీ షోకు యాంక‌ర్ గా చేస్తుంద‌ని ర‌క‌రకాల వార్తలు వ‌చ్చాయి. కానీ అది ప్రచారంగానే మిగిలిపోగా వైష్ణ‌వి మాత్రం యాంక‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌లేదు.

ఇదిలా ఉంటే వైష్ణ‌వి యాంక‌ర్ గా ఎంట్రీ ఇవ్వ‌లేదు కానీ ప్ర‌స్తుతం ఆమె ఓ మీడియా ఛాన‌ల్ కు సీఈవో గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. యూట్యూబ్ మ‌రియు షార్ట్ న్యూస్ రంగంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఓ మీడియా సంస్థ‌కు అన‌సూయ సోద‌రి వైష్ణవి సీఈవో గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వైష్ణవి ఫ్యూచ‌ర్ లో అయినా యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తోంది.

మ‌రి అనూస‌య సోద‌రి యాంకర్ గా ప‌రిచయం అయితే ఆక‌ట్టుకుంటుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే అన‌సూయ ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టీవీ 9 న్యూస్ యాంక‌ర్ గా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన అన‌సూయ ప్ర‌స్థుతం ఇండస్ట్రీలో బిజీ న‌టిగా మారిపోయింది. వ‌రుస పెట్టి సినిమాల్లో న‌టిస్తోంది.

 

అంతే కాకుండా పుష్ప సినిమా బ్లాక్ బస్ట‌ర్ అవ్వ‌డంతో పాన్ ఇండియా లెవ‌ల్ లో అవ‌కాశాల‌ను అందుకుంటోంది. మ‌రోవైపు పుష్ప పార్ట్ 2 లో త‌న రోల్ మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండ‌బోతుంది అంటూ కూడా అన‌సూయ ఇప్ప‌టికే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news