Movies' యార్ల‌గ‌డ్డ సుప్రియ ' జీవితంలో పెద్ద‌ విషాద‌పు గాయాలు మాన్పుతోన్న...

‘ యార్ల‌గ‌డ్డ సుప్రియ ‘ జీవితంలో పెద్ద‌ విషాద‌పు గాయాలు మాన్పుతోన్న అడ‌వి శేష్‌…!

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ 60 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దివంగత లెజెండ్రీ అక్కినేని నాగేశ్వరరావు ఈ వంశానికి ఇండస్ట్రీలో బీజం వేశారు. ఏఎన్ఆర్ తర్వాత ఆయన తనయుడు నాగార్జున కూడా టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగారు. ఇప్పుడు నాగార్జున తనయులు అఖిల్ – నాగచైతన్య ఇద్దరు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకుంటున్నారు. సహజంగా ప్రతి ఒక్కరి కెరీర్లో ఆటుపోట్లు ఉంటాయి. అయితే ఏఎన్ఆర్ కుమార్తె వారసులుగా ఇండస్ట్రీలోకి వచ్చిన యార్ల‌గడ్డ సుమంత్ – యార్లగడ్డ సుప్రియ జీవితాలు మాత్రం ఎన్నో ఆటుపోట్లకు గురయ్యాయి.

ఇద్దరి సినిమా కెరియర్ మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితాలు కూడా పెద్దగా కలిసి రాలేదు. సుమంత్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్లో నాలుగైదు మంచి సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ హిట్లు లేవు. క‌నీసం నాగచైతన్య – అఖిల్ లా మిడిల్ రేంజ్ హీరోగా కూడా సుమంత్ నిలదొక్కుకోలేకపోయాడు. తన మేనమామతో కలిసి సినిమాలు చేసిన ప్రేక్షకులు పట్టించుకోలేదు.

తమ తోడు పుట్టిన చెల్లెల్లను కోల్పోయిన మన టాలీవుడ్ హీరోస్ ఎవరో తెలుసా |  Tollywood Heros Lost Their Sisters , Tollywood, Bala Krishna, Umamashwari,  Nagarjuna, Sathya Vathi, Died, Sumanth ...

ఇక సుమంత్ వ్యక్తిగత జీవితం కూడా ఆటుపోట్లకు గురైంది. అప్పట్లో స్టార్ హీరోలతో నటించిన ఫేమస్ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లాడిన సుమంత్.. ఏడాది తిరగకముందే మనస్పర్ధలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. సుమంత్ కు విడాకులు ఇచ్చేసిన మరుసటి యేడాదే కీర్తిరెడ్డి ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చి 17 సంవత్సరాలు అవుతున్న సుమంత్ ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోలేదు.

She Used To Fight With Pawan Daily | cinejosh.com

అటు సినిమా కెరియర్ కూడా ఏమాత్రం కలిసి రావటం లేదు. ఇక సుమంత్ సోదరి సుప్రియ కూడా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత సినిమాలు చేయలేదు. ఉషాకిరణ్ మూస్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ఇష్టం సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డితో సుప్రియ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. చరణ్ విపరీతమైన మద్యానికి బానిస కావటంతో సుప్రియ అతడికి దూరమైంది. ఆ తర్వాత చరణ్ అనారోగ్యంతో మృతి చెందాడు.

ఆ తర్వాత సుప్రియ జీవితం కూడా పెద్ద విషాదంగా మారిపోయింది. అసలు ఆమె చాలా రోజులు బయటకు కనిపించలేదు. చాలా రోజుల తర్వాత అడ‌వి శేష్ హీరోగా వచ్చిన గూఢ‌చారి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా సమయం నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని… ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారని అంటారు. సుప్రియ కంటే వయసులో చిన్నోడు అయిన‌ అడవి శేషుతో ఆమె ప్రేమలో ఉందని… వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఇది జరగదేమోనని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అడవి శేష్‌ తాజాగా 38వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇంకా పెళ్లి ఊసు ఎత్తట్లేదు. అయితే అతడు మాత్రం సింగిల్ కాదన్నది టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. సుప్రియ తోనే అతడు రిలేషన్ షిప్ లో ఉన్నట్టుగా ప్రచారాలు అయితే కొంతకాలంగా జరుగుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్లలో బయటకు వచ్చిన ఫోటోలో అక్కినేని కుటుంబ సభ్యుల మధ్యలో అడవి శేష్‌ కూడా ఉన్నాడు.

దీంతో శేష్ – సుప్రియ‌య నిజంగానే రిలేషన్ లో ఉన్నారా అంటూ వస్తున్న సందేహాలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఈ ఫోటోలో శేష్ సుప్రియ పక్కనే చాలా చనువుగా ఉన్నట్టు కనిపించాడు. ఇప్పటివరకు వీరి రిలేషన్ సీక్రెట్ గా కొనసాగుతుంద‌న్న డౌట్లు ఉన్నా… తాజా ఫోటోతో వీరిద్దరూ ఓపెన్ అయిపోయారన్న చర్చలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నాయి. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారా ? లేదా అన్నది వారిద్దరి వ్యక్తిగతం. ఒకవేళ నిజంగా అదే జరిగితే సుప్రియ జీవితంలో శేష్ స‌రికొత్త వెలుగులు నింపుతాడ‌నే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news