Moviesఆ టాలీవుడ్ స్టార్ హీరో డ్ర‌గ్ ఎడిక్టా... భార్య కూడా డ్ర‌గ్స్...

ఆ టాలీవుడ్ స్టార్ హీరో డ్ర‌గ్ ఎడిక్టా… భార్య కూడా డ్ర‌గ్స్ లేక‌పోతే ఉండ‌లేదా…?

గ‌త రెండేళ్ల నుంచి టాలీవుడ్‌ను డ్ర‌గ్స్ భూతం ఎలా కుదిపేస్తుందో చూస్తూనే ఉన్నాం. సిట్ ఎంతోమంది సెల‌బ్రిటీల‌ను విచారించ‌డం.. దీనిపై మీడియాలో పెద్ద ర‌చ్చ జ‌ర‌గ‌డం.. ఆ వెంట‌నే చ‌ల్లారిపోవ‌డం చూశాం. అస‌లు డ్ర‌గ్స్ ఉదంతం ఒక్క టాలీవుడ్‌ను మాత్ర‌మే కాదు.. సౌత్ టునార్త్ అన్ని భాష‌ల సినిమా ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఎంతో మంది హీరోలు, హీరోయిన్ల నుంచి డైరెక్ట‌ర్ల వ‌ర‌కు ఈ మ‌త్తు వ‌ల‌లో ప‌డి చిత్తైపోతున్నారు.

కొంద‌రు స్టార్ హీరోల వార‌సులు సైతం డ్ర‌గ్స్‌కు ఎడిక్ట్ అయిపోయార‌న్న గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి. అయితే స్మార్ట్‌గా ఉండే ఓ స్టార్ హీరో సైతం ఇప్పుడు డ్ర‌గ్స్‌కు ఎడిక్ట్ అయిపోయాడ‌ని టాక్ ? ఆ స్టార్ హీరో ముంబై నుంచో లేదా ఇత‌ర దేశాల నుంచో డ్ర‌గ్స్ తెప్పించుకుని ఎంజాయ్ చేస్తాడ‌ని కూడా ఇండ‌స్ట్రీలో కొంద‌రి మ‌ధ్య గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి.

అయితే స‌ద‌రు స్టార్ హీరోతో పాటు అత‌డి భార్య కూడా డ్ర‌గ్స్ ఎడిక్ట‌ర్ అని టాక్ ? ఆమెకు ఆ స్టార్ హీరోతో పెళ్లికి ముందు నుంచే డ్ర‌గ్ ఫ్లెడ‌ర్స్‌, కొంద‌రు మాఫియా టీంతో లింకులు ఉండేవని అంటారు. అందుకే పెళ్ల‌య్యాక కూడా ఆమె డ్ర‌గ్స్ తీసుకోవ‌డ ఆప‌లేద‌ని.. ఆమె వ‌ల్లే ఆ హీరో కూడా డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డిపోయాడ‌ని అంటున్నారు.

క‌రోనా టైంలో వీరి ఇంట్లో ప్ర‌తి రోజు డ్ర‌గ్స్ పార్టీ జ‌రిగేద‌న్న టాక్ కూడా అప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ స్టార్ హీరో అందం వెన‌కాల కూడా డ్ర‌గ్స్ మ‌హ‌త్యం ఉంద‌ని అంటూ ఉంటారు. ఇక 50 ఏళ్లు పై బ‌డిన మ‌రో మిడిల్ రేంజ్ హీరో కూడా ఫుల్లుగా ఎప్పుడూ డ్ర‌గ్స్ మ‌త్తులోనే మునిగి తేల‌తూ ఉంటాడ‌ని ఇండ‌స్ట్రీ టాక్ ? ఏదేమైనా ఇండ‌స్ట్రీలో చాలా మంది సీక్రెట్‌గా డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news