Moviesఉదయ్ కిరణ్ చావు చూసి భయపడి..ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయిన స్టార్ హీరో..!!

ఉదయ్ కిరణ్ చావు చూసి భయపడి..ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయిన స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరని చాలామంది చెప్తున్నా సరే కొందరు యువత తమకున్న ప్యాషన్ తో ..కోరికలతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా హీరోయిన్లకు అడుగు పెడతారు . అడుగుపెట్టిన వెంటనే హీరో హీరోయిన్లు సక్సెస్ అవ్వలేరు ..సక్సెస్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే స్టార్ హీరో స్టేటస్ కొనసాగుతుందా..? అంటే నో అనే చెప్పాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదయ్ కిరణ్ .

ఎంత త్వరగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్నాడో..అంతే త్వరగా పాతాళానికి పడిపోయి ..ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మనకు తెలిసిందే ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో లాస్ట్ కి ఫైనాన్షియల్ పొజిషన్ బాగోలేక ఇంటి అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో సూసైడ్ చేసుకుని చనిపోయారు . ఉదయ్ కిరణ్ మరణం సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకి గుణపాఠం గా మారిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతేకాదు ఉదయ్ కిరణ్ మరణం చూసి టాలీవుడ్ లో అప్పటివరకు సినిమాలు చేసిన ఓ హీరో ఇండస్ట్రీ నే వదిలి దూరంగా వెళ్లిపోయి ..వ్యాపారం చేసుకుని బతుకుతున్నాడు . బడా బడా ప్రొడ్యూసర్ ల తో సినిమాలు తీసి.. హ్యూజ్ రేంజ్ లో ప్రాఫిట్స్ తీసుకొచ్చిన ఈ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు . అతడు సినిమా రిలీజ్ అయింది అంటే చాలు.. థియేటర్స్ వద్ద అమ్మాయిల హంగామా బీభత్సంగా ఉంటుంది. ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఉదయ్ కిరణ్ మరణించిన తర్వాత ఇండస్ట్రీలో తెరపై కనిపించడమే మానేశారు. అవకాశాలు ఇస్తున్నా సరే నో అంటూ దూరంగా వెళ్లి హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.. స్టార్ గా ఉన్న ఉదయ్ కిరణ్ లాస్ట్ కి ఎలాంటి మరణం పొందాడు చూసినా హీరో ఆ భయానికి ఇండస్ట్రీలో పెరిగిపోయిన నెపోటిజంకి తట్టుకోలేక దూరంగా వెళ్లిపోయి హ్యాపీగా బిజినెస్ చేసుకొని బ్రతికేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news