Moviesఎన్టీఆర్‌ను హేళ‌న చేసింది ఎవ‌రు... నాటి సీక్రెట్ బ‌య‌ట పెట్టిన హీరోయిన్‌...!

ఎన్టీఆర్‌ను హేళ‌న చేసింది ఎవ‌రు… నాటి సీక్రెట్ బ‌య‌ట పెట్టిన హీరోయిన్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త‌న చివ‌రి సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమాతో త‌న క్రేజ్‌ను వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎల్ల‌లు దాటించేశాడు. ఈ సినిమాకు ముందు వ‌ర‌కు ఎన్టీఆర్ టాలీవుడ్ హీరో. కానీ ఈ సినిమా దెబ్బ‌తో పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ హీరో అయిపోయాడు. తెలుగు వారు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ ఉన్నా కూడా త్రిబుల్ ఆర్ సినిమా చూసి ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపాన్ని ఎంజాయ్ చేశారు. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించేశారు.

చివ‌ర‌కు ఎన్టీఆర్ న‌ట‌న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఫేమ‌స్ అవ్వ‌డంతో పాటు ఆస్కార్ అవార్డు వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌ల వ‌ర‌కు వెళ్లింది. దీనిని బ‌ట్టే జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప‌న‌టుడో అర్థ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌తో గ‌తంలో ఓ సినిమాలో న‌టించిన ఓ హీరోయిన్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబ‌ల్ ఫేస్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. ఎన్టీఆర్‌కు డెఫినెట్‌గా గ్లోబ‌ల్ క్రేజ్ వ‌చ్చేస్తుంద‌న్న ఆ న‌టి ఎవ‌రో కాదు పాయ‌ల్ ఘోష్‌.

ఎన్టీఆర్ – త‌మ‌న్నా కాంబినేష‌న్లో వ‌చ్చిన ఊస‌ర‌వెల్లి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో పాయ‌ల్ ఘోష్ త‌మ‌న్నా స్నేహితురాలి పాత్ర‌లో కనిపించింది. ఆమె ఎన్టీఆర్ టాలెంట్‌కు ఎప్పుడూ ఫిదా అవుతూ ఉంటుంది. ఎన్టీఆర్‌కు ఎప్ప‌టి నుంచో పాయ‌ల్ పెద్ద ఫ్యాన్‌. ఇక త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కాక‌ముందు కూడా పాయ‌ల్ 2020లో తార‌క్ గ్లోబ‌ల్ ఫేస్ అవుతాడ‌ని చెప్పింది.

Junior NTR didn't have it easy, so shut up about nepotism: Payal Ghosh - IBTimes India

నాడు పాయ‌ల్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం అయ్యింది. ఇప్పుడు ఇదే విష‌యాన్ని ఆమె గుర్తు చేస్తూ ఆ రోజు తాను అలా అంటే అంద‌రూ న‌వ్వారు. హేళ‌న చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబ‌ల్ ఫేస్ అయ్యాడు. అంటూ ఎన్టీఆర్ విష‌యంలో ఆమె గ‌ర్వంగా ఫీల్ అవుతూ ట్వీట్ చేసింది. ఇప్పుడు పాయ‌ల్ చేసిన కామెంట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను ప్ర‌శంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news