Moviesబన్నీని తొక్కేయడానికి భారీ కుట్ర జ‌రుగుతోందా... తెర‌వెన‌క క‌థ న‌డిపిస్తోందెవ‌రు..!

బన్నీని తొక్కేయడానికి భారీ కుట్ర జ‌రుగుతోందా… తెర‌వెన‌క క‌థ న‌డిపిస్తోందెవ‌రు..!

ప్రస్తుత పరిస్థితుల్లో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా స్టార్ స్టేటస్ అందుకోవడం సులువు కాదు. ఎంత పెద్ద స్టార్ వార‌సుల‌కు అయినా టాలెంట్ ఉండాలి… ల‌క్ క‌లిసి రావాలి. గంగోత్రి సినిమా రిలీజైన సమయంలో బన్నీపై ఊహించని రేంజ్ లో విమర్శలు వచ్చాయి. బన్నీ స్టార్ హీరో కావడం అసాధ్యమని కామెంట్లు వినిపించాయి. అయితే తనపై విమర్శలు చేసిన వాళ్లందరికీ ఆర్య సినిమాతో బన్నీ సమాధానమిచ్చారు. ఈ సినిమా సక్సెస్ తో యూత్ ఐకాన్ గా మారిపోయిన అల్లు అర్జున్ సినిమా సినిమాకు తన లుక్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో నటించకుండానే పాన్ ఇండియా స్టేటస్ సొంతం చేసుకున్న హీరోలలో బన్నీ ఒకరు. బ‌న్నీ హిట్ సినిమాల్లో డైరెక్ట‌ర్ల‌ది ఎంత కీ రోల్ ఉన్నా అక్క‌డ బ‌న్నీ టాలెంట్‌, స్టైల్‌, డ్యాన్సులే అత‌డికి తిరుగులేని స్టార్ స్టేట‌స్ తెచ్చిపెట్టాయి. పుష్ప ది రైజ్ సినిమాకు ప్రమోషన్స్ చేయకుండానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అల్లు అర్జున్ కు సక్సెస్ దక్కింది.

అయితే బన్నీని తొక్కేయడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ కుట్ర జరుగుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. బన్నీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఆశ పడుతున్న సంగతి తెలిసిందే.

అయితే కొంతమంది సినీ విమర్శకులు రోహిత్ శెట్టి డైరెక్షన్ లో బన్నీ నటించవద్దని… టాలీవుడ్ స్టార్ హీరోల స్టార్ డమ్ తొక్కేయడానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల విషయంలో బాలీవుడ్ డైరెక్టర్లు ఈ తరహా ప్రణాళికలు చేస్తున్నారని సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ అన్నారు. టాలీవుడ్ స్టార్స్ సౌత్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ నిర్మాతలు పెట్టుబడులు పెట్టిన సౌత్ సినిమాలు కూడా ఎక్కువగా సక్సెస్ సాధించలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ ఆదిపురుష్ లో నటించి తప్పు చేశాడని వినిపిస్తోంది. బన్నీ పప్పులో కాలేయకుండా ఉంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు. బాలీవుడ్ టెక్నీషియన్లు సాహో, రాధేశ్యామ్ సినిమాలను పాడు చేశారని సినీ క్రిటిక్స్ వెల్లడిస్తున్నారు. గ‌తంలో రామ్ చ‌ర‌ణ్ కూడా బాలీవుడ్ డైరెక్ట‌ర్‌తో తుఫాన్ సినిమా చేస్తే డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news