Moviesవావ్: సూపరో సూపర్.. ది కింగ్ ఈజ్ బ్యాక్..ఇక ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!!

వావ్: సూపరో సూపర్.. ది కింగ్ ఈజ్ బ్యాక్..ఇక ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!!

సుడిగాలి సుధీర్ ..ఈ పేరుకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా పాపులారిటికి వచ్చిన కి వచ్చిన సుధీర్.. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ గా మారి తనదైన స్టైల్ లో స్కిట్స్ వేస్తూ ఈవెంట్స్ లో జనాలను నవ్విస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . కాగా గత కొన్ని వారాల నుంచి సుడిగాలి సుధీర్ బుల్లితెరపై కనిపించడమే మానేశారు.

ఈ క్రమంలోనే ఇక సుడిగాలి సుధీర్ బుల్లితెరపై కనిపించరని వెండితెరపై సినిమాలో మాత్రమే చేస్తారని ..అంతే కాదు అతనికి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో ని వదిలేసి సుడిగాలి సుధీర్ మిస్టేక్ చేశారని కొందరు ఫాన్స్ మండిపడ్డారు . కాగా ఇలాంటి క్రమంలోనే సుడిగాలి సుధీర్ ఆ వార్తలను తిప్పికొడుతూ శ్రీదేవి డ్రామా కంపెనీలోకి మళ్లీ రి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇవ్వడం మనం చూడొచ్చు . కాగా ఒక్కసారిగా సుధీర్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు . ఆనందం వ్యక్తం చేస్తూ వెల్కమ్ చెబుతూ నువ్వు లేని ఈ షో చాలా వెలితిగా ఉండింది అని చెప్పుకొచ్చారు.

అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ టిఆర్పి రేటింగ్స్ ఇన్నాళ్లు పడిపోయిన విషయం తెలిసిందే . మొదట శ్రీదేవి డ్రామా కంపెనీకి హోస్టుగా చేసింది సుధీర్ నే..ఆ తర్వాత కొన్ని కారణాల చేత రష్మిని ఇక్కడికి పిలిపించి ఆయన దూరమయ్యారు .కాగా రీజన్స్ ఏమో తెలియదు కానీ సుడిగాలి సుధీర్ మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీ కి వచ్చి అభిమానుల కోరికలు నెరవేర్చారు . అంతేకాదు సుదీర్ ని చూడగానే రష్మి కన్నీరు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది . దీంతో ఒక్కసారిగా సుధీర్ పేరుని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు అభిమానులు . ఇక ఒక్కొక్క షోకి టీఆర్పీలు పగిలిపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. చూద్దాం సుడిగాలి సుధీర్ రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news