Moviesవిశ్వక్ సేన్ కు దిమ్మ తిరిగిపోయే షాక్.. ఆయన ప్లేస్ లోకి...

విశ్వక్ సేన్ కు దిమ్మ తిరిగిపోయే షాక్.. ఆయన ప్లేస్ లోకి స్టార్ హీరో..అర్జున్ మామూలోడు కాదుగా..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కనిపిస్తున్న అంశం ఏదైన ఉంది అంటే అది విశ్వక్ సేన్- సీనియర్ హీరో అర్జున్ . మనకు తెలిసిందే అర్జున్ కూతురు ఐశ్వర్యాన్ని హీరోయిన్గా పరిచయం చేస్తూ టాలీవుడ్ లో ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమాకు మొదటి క్లాప్ కొట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,

దీంతో ఒక్కసారిగా సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అయితే సినిమా షూటింగ్ కి రాకుండా విశ్వక్ సేన్ డుమా కొడుతున్నాడు అంటూ అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు షెడ్యూల్ టైం అవుతుంది షూటింగ్ కి రమ్మంటే నెగ్లెజెన్సీగా ఆన్సర్ చెప్తున్నాడని ..ఫోన్ లిఫ్ట్ చేయడని..ఎక్కడున్నాడో ఆన్సర్ ఇవ్వడని అర్జున్ చెప్పుకోచ్చారు. ఈ క్రమంలోనే వీళ్ళ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

కాగా విశ్వక్ సేన్ బిహేవియర్ తో విసుగెత్తిపోయిన అర్జున్ సినిమా మండలకి కంప్లైంట్ చేసి ఆయన ను ఈ సినిమా నుంచి తప్పించి వేరే హీరోని పెట్టుకున్నట్లు తెలుస్తుంది . ఆ హీరో ఎవరో కాదు ఫ్యామిలీ హీరో శర్వానంద్ . ఎస్ హిట్లు ఫ్లాప్ ల తో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ అయినట్టు న్యూస్ వైరల్ గా మారింది . ఒకవేళ నిజంగా అది నిజమే అయితే విశ్వక్ సేన్ కి కొలుకోలేని దెబ్బ అని చెప్పాలి . సినీ ఇండస్ట్రీలో హిట్లు ప్లాపులు కన్నా డిసిప్లేన్ చాలా ఇంపార్టెంట్ అలా డిసిప్లేన్ లేని హీరోలని జనాలు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడిప్పుడే హీరో సక్సెస్ అందుకుంటున్న విశ్వ ఇలా హెడ్వైట్ గా బిహేవ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటున్నారు ఫాన్స్ . చూద్దాం ఈ యవ్వారం ఎంత వరకు పోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news