Moviesit's Official: త్వరలోనే నా పెళ్లి ..అభిమానులకి విశాల్ తీపి కబురు..!!

it’s Official: త్వరలోనే నా పెళ్లి ..అభిమానులకి విశాల్ తీపి కబురు..!!

కోలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో విశాల్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు కోలీవుడ్ సినీ ప్రముఖులు. ఈ విషయాన్ని ఆయనే అఫీషియల్ గా ప్రకటించారు. స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు . అంతేకాదు తన సినిమాలు తెలుగు లో డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడ కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.

దీంతో ఆయన కు సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే తెలుగులో కూడా వైరల్ గా మారుతూ ఉంటుంది . రీసెంట్గా కొన్ని రోజులు ముందు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అభినయాను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు . ఈ సినిమాలో ఆమె విశాల్ కు భార్యగా నటిస్తుంది . ఈ క్రమంలోనే వీళ్లిద్దరు జంట బాగుంటుందని ..మనసులు కలిసి ప్రేమకు దారితీసి., అది పెళ్లి వరకు వెళ్లిందంటూ న్యూస్ లు వినిపించాయి.

అయితే అవి అంత ఫేక్ అంటూ మేము రియల్ పెయిర్ కాదు రీల్ పెయిర్ అంటూ అభినయ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు . “నాకు పెద్దలు కుదిరిచిన వివాహం నచ్చదు ..సెట్ కాదు.. ప్రేమించే పెళ్లి చేసుకుంటాను . నా అభిమానులకి త్వరలోనే నేను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేస్తాను. నేను ఓ పని మీద బిజీగా ఉన్నాను . యాక్టర్స్ యూనియన్ కోసం బిల్డింగ్ కడుతున్నాను. ఈ బిల్డింగ్ పూర్తయిన వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను . ఆ అమ్మాయిని మీకు పరిచయం చేస్తాను .మీ ఆశీర్వాదం మా ఇద్దరికీ కావాలి “అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా గతంలో తమిళ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు నటి వరలక్ష్మి శరత్ కుమార్త విశాల్ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఓ యాక్టర్స్ ను ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి విషయం వచ్చేసరికి బ్రేకప్ చెప్పేసాడు. దీంతో ముచ్చటగా మూడోసారి విశాల్ పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news