Moviesపుష్ప చూసాను..కానీ, ఆ హీరో ఎవరో నాకు తెలియదు.. అల్లు ఫ్యాన్స్...

పుష్ప చూసాను..కానీ, ఆ హీరో ఎవరో నాకు తెలియదు.. అల్లు ఫ్యాన్స్ కి మండించిన సీనియర్ బ్యూటీ..!!

గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన సినిమా “పుష్ప”. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన ఈ సినిమాను డైరెక్ట్ చేసింది లెక్కల మాస్టర్ సుకుమార్ . అందుకే సినిమాలో ప్రతిదీ సమానమైన లెక్కలతో ముందుకెళ్ళింది . ఈ సినిమా ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ ..ఇప్పటికీ మనం మన వాడుక భాషలో మాట్లాడుతున్నాం ..వాడుతున్నాం ..అంటే ఈ సినిమా ఎలా మన బుర్రకి ఎక్కేసిందో అర్థం చేసుకోవచ్చు .

అంతే కాదు ఈ సినిమాలో నటించిన తర్వాతే అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగిపోయింది. ఇప్పుడు రష్మిక టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది . మరి అలాంటి సినిమాలో నటించిన హీరో తెలియకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ . పుష్ప పేరు చెప్తే ఊగిపోయే జనాలకు ఈ మాటలు మింగుడు పడడం లేదు.

కాగా రీసెంట్గా ఆలీతో సరదాగా అనే గేమ్ షోకు సీనియర్ బ్యూటీ ఎల్ విజయలక్ష్మి వచ్చారు దీనికి సంబంధించిన ప్రోమో ను రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఈ ప్రోమోలో విజయలక్ష్మి తన బాల్యం నుంచి ఇప్పటివరకు ఎదుర్కొన్న సిచువేషన్స్.. గడిపిన స్వీట్ మెమోరీస్ అన్ని ఓపెన్ గా షేర్ చేసింది. అంతేకాదు తనని ఎన్టీఆర్ కోడలా కోడలా అంటూ ముద్దుగా పిలిచే వారని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోని ఆయనతో కలిసి గుండమ్మ కథ సినిమాలో డాన్స్ చేసామని ..కానీ ఆ పాటను కొన్ని అనివార్య కారణాల కారణంగా సినిమా నుంచి తీసేసారని చెప్పకు వచ్చింది.

ఈ క్రమంలోనే ఆలీ రీసెంట్ జనరేషన్ హీరోస్ లో ఏ సినిమా చూశారు అనగా పుష్ప అంటూ చెప్పుకొచ్చింది . మరి ఆ సినిమాలో హీరో ఎవరో మీకు తెలుసా అని ఆలీ అడగగానే ..అతను ఎవరో నాకు తెలియదు కానీ బాగా నటించాడు అంటూ చెప్పుకొచ్చింది . అప్పుడు ఆలీ అతను ఎవరో కాదు అల్లు రామలింగయ్య మనవడు అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో ఆమె ఏంటో ఇప్పుడు ఏ హీరోని అడిగినా రామానాయుడు మనవడు ,ఎన్టీఆర్ మనవడు ,రామలింగయ్య మనవడు అంటూ చెప్పుకొస్తున్నారు అంటూ మాట్లాడింది . దీంతో ఆమె తెలియక అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ను కూడా కొందరు ఫాన్స్ తీసుకోలేకపోతున్నారు .. ఆమెపై మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news