Moviesనాగార్జున హీరోయిన్‌తో షారుక్‌ఖాన్ ఎఫైర్ పెట్టుకున్నాడా... భార్య గౌరి దెబ్బతో సీన్...

నాగార్జున హీరోయిన్‌తో షారుక్‌ఖాన్ ఎఫైర్ పెట్టుకున్నాడా… భార్య గౌరి దెబ్బతో సీన్ రివ‌ర్స్‌…!

టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల‌తో న‌టించాడు. అప్ప‌ట్లో నాగార్జున న‌టించిన హీరోయిన్ల‌తో ఆయ‌న రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయేది. సోనాలి బింద్రే, అంత‌కు ముందే జూహీచావ్లా, ట‌బు, ఊర్మిళ‌, మ‌నీషా కోయిరాలా, శ్రీదేవి లాంటి హీరోయిన్ల‌తో నాగ్ న‌టించాడు. నాగ్ అందానికి బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఫిదా అయ్యేవారు. అస‌లు నాగార్జున‌కు ఒక టైంలో హిందీ మార్కెట్ బాగానే వ‌చ్చింది. అయితే మ‌నోడి మ‌న‌సంతా టాలీవుడ్ మీదే ఉండ‌డంతో అక్క‌డ స‌రిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌లేక‌పోయాడు.

ఇక నాగార్జున ప‌క్క‌న జూహీచావ్లా కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. నాగ్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన టైంలో అక్క‌డ కింగ్ షారుక్‌ఖాన్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. స‌ల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్ లాంటి హీరోల‌ను మించి అప్ప‌ట్లో షారుక్ క్రేజ్ ఉండేది. షారుక్ – కాజ‌ల్ జంట సినిమా అంటే దేశం మొత్తం ఊగిపోయేది. యూత్‌, ఫ్యామిలీ, ఓల్డేజ్ ప్రేక్ష‌కులు కూడా వీళ్ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేవారు.

అప్ప‌ట్లో కాజ‌ల్‌తో షారుక్ ప్రేమ‌లో ఉన్నాడ‌నే అంటారు. అప్ప‌టికే షారుక్‌కు గౌరీఖాన్‌తో పెళ్లియ‌పోయింది.. చివ‌ర‌కు గౌరీ షారుక్‌కు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వ‌డంతో మ‌నోడు భార‌మైన మ‌న‌స్సుతో కాజ‌ల్‌కు దూర‌మ‌య్యాడు. చివ‌ర‌కు కాజ‌ల్ అజ‌య్ దేవ‌గ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత కూడా షారుక్ జూహీచావ్లాను లైన్లో పెట్టాడ‌నే అంటారు. జూహీ అప్ప‌ట్లో ఓ మెరుపు తీగ‌.. ఆమె అందం చాలా నాజూకు.. నార్త్ నుంచి సౌత్ వ‌ర‌కు ఆమెకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉండేవారు.

జూహీ – షారుక్ కాంబోలో కూడా అప్ప‌ట్లో ఎక్కువ సినిమాలు వ‌చ్చాయి. ఆ టైంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ఘాటు ఎఫైర్ కొన‌సాగింద‌ని అంటారు. అయితే భార్య గౌరీ వీరిని ఎప్ప‌టిక‌ప్పుడు ఓ కంట క‌నిపెడుతూ షారుక్‌ను కంట్రోల్ చేయ‌డంతో జూహీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో షారుక్‌కు దూర‌మైంది. అయితే ఇప్ప‌ట‌కీ వీరి మ‌ధ్య స్నేహం కొన‌సాగుతూనే ఉంది.

ఇక షారుక్‌కు దూర‌మ‌య్యాక జూహీ లండ‌న్ బేస్డ్ వ్యాపార వేత్త జై మెహ‌తాను పెళ్లి చేసుకుంది. కొంత కాలంపాటు వీరి ప్రేమ వివాహం సీక్రెట్‌గా ఉంచి.. ఆ త‌ర్వాత రివీల్ చేశారు. షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ఇటీవ‌ల డ్ర‌గ్స్ కేసుల్లో ఇరుక్కున్న‌ప్పుడు కూడా జూహీయే స్వ‌యంగా అక్క‌డ‌కు వ‌చ్చి షారుక్ ఫ్యామిలీకి ధైర్యం చెప్ప‌డంతో పాటు ఆర్య‌న్‌కు బెయిల్ వ‌చ్చేవ‌ర‌కు ఎక్కువుగా షారుక్ ఇంట్లోనే గ‌డిపింది. ఇక ఆర్య‌న్ త‌న 24వ పుట్టిన రోజు జ‌రుపుకున్న‌ప్పుడు కూడా తాను 24 మొక్క‌లు నాటుతాన‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news