Moviesభ‌ర్త‌కు విడాకులు... ఇన్‌స్టాలో షాకింగ్ పోస్టు పెట్టిన స్నేహ‌...!

భ‌ర్త‌కు విడాకులు… ఇన్‌స్టాలో షాకింగ్ పోస్టు పెట్టిన స్నేహ‌…!

నటి స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని హోమ్లీ క్యారెక్ట‌ర్ల‌తో ప‌దేళ్లపాటు స్నేహ ఒక ఊపు ఊపేసింది. తెలుగుతో పాటు తమిళం అటు కన్న‌డ‌ సినిమాల్లో నటించింది. స్నేహ తెలుగు అమ్మాయి కాకపోయినా అచ్చ తెలుగు ఆడపడుచులా ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగులో సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఎన్నో ప్రశంసలు పొందింది.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో స్నేహకు ఎంతో క్రేజ్‌ ఉండేది. సౌందర్య తర్వాత ఇక్కడ ఆ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న ఘనత స్నేహకి దక్కుతుంది. ఇక స్నేహ 2011లో బుల్లితెర నటుడు, దర్శకుడు ప్రసన్నకుమార్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన స్నేహ.. ఇటీవలే రెండో ఇన్నింగ్స్ కూడా ఆరంభించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ కు వదినగా కనిపించి మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.

ఇక స్నేహ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. ఆమె తన ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ ను పలకరిస్తూనే ఉంటుంది. ఇక గ‌త కొద్ది రోజులుగా స్నేహ వైవాహిక జీవితం గురించి ర‌క‌ర‌కాల పుకార్లు వ‌స్తున్నాయి. ఆమె కొంత కాలంగా త‌న భ‌ర్త ప్ర‌స‌న్న‌కుమార్‌తో మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో దూరంగా ఉంటోంద‌న్న పుకార్లు బాగా స్ప్రెడ్ అయ్యాయి. వారం రోజులుగా ఇవే బాగా వైర‌ల్ అవుతున్నాయి.

విచిత్రం ఏంటంటే త‌మిళం కంటే తెలుగులోనే ఇవి బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ వార్త‌ల‌పై స్నేహ తాజాగా త‌న ఇన్‌స్టా వేదిక‌గా స్పందించింది. త‌న భ‌ర్త ప్ర‌స‌న్న‌కుమార్‌తో క‌లిసున్న ఓ అంద‌మైన ఫొటో షేర్ చేయ‌డంతో పాటు ట్విన్సింగ్ అంటూ కామెంట్ పెట్టింది. ఈ ఒక్క కామెంట్‌తోనే స్నేహ త‌న విడాకుల పుకార్ల‌కు చెక్ పెట్టిన‌ట్టు అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news