Moviesతమన్నాకి కావాల్సింది డబ్బేనా... అందుకేనా ఆ షాకింగ్ డెసిష‌న్లు...!

తమన్నాకి కావాల్సింది డబ్బేనా… అందుకేనా ఆ షాకింగ్ డెసిష‌న్లు…!

తమన్నాకి కావాల్సింది డబ్బేనా..అందుకే ఏ హీరోతో పడితే ఆ హీరోతో…? అంటూ ఇటీవల కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శ్రీ సినిమాతో హీరోయిన్‌గా మారిన తమన్నా మొదటి సినిమాతో పరాజయాన్నే అందుకుంది. అయినా శేఖర్ కమ్ముల ఛాన్స్ ఇచ్చాడు. హ్యాపీడేస్ సినిమాలో నటించిన తమన్నా ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. హ్యాపీడేస్ తర్వాత రచ్చ తమన్నా కెరీర్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్ళింది. దాంతో వరుసగా అవకాశాలను అందుకుంటూ వస్తోంది.

కేవలం మెగా ఫ్యామిలీలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రామ్‌ చరణ్ ఇలా వరుసగా సినిమాలు చేసింది. మెగా హీరోలతో నటించి హిట్స్ అందుకుంటే చాలు ఇక మిగతా హీరోల సరసన నటించడం పెద్ద కష్టమేమీ కాదు. అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. తమన్నాకి అంతే దాదాపు తెలుగులో అందరు హీరోల సరసన నటించింది. ప్రభాస్, మహేష్ బాబు..ఇలా టాలీవుడ్‌లో సూర్య, కార్తి, ధనుష్ ఇలా కోలీవుడ్ హీరోలను చుట్టేసింది.

ఇలా సౌత్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన తమన్నా బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా నటించింది పాపులర్ అయింది. హీరోయిన్‌గా కెరీర్ మంచి ఊపుమీద ఉండగానే ఈ మిల్కీ బ్యూటీ ఐటెం సాంగ్స్ చేయడమూ మొదలుపెట్టింది. మహేష్ సరస‌న ఆగ‌డు సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకుంది.

 

అలాగే బెల్లంకొండ శ్రీను హీరోగా నటించిన సినిమాలోనూ తమన్నా ఆడిపాడింది. వాస్తవంగా తమన్నాకి ఉన్న క్రేజ్ చూస్తే కుర్ర హీరోలతో రొమాన్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, తమన్నా అలాంటి ఆలోచన ధోరణిలో లేదు. ఇక్కడ రిలేషన్స్ ముఖ్యం. అవకాశాలు రావడం అదృష్ఠం. దాన్ని నిలబెట్టుకోవాలంటే కూడా అందరి వల్లా కాదు. అదే తమన్నా చేస్తుంది. హీరో చిన్నవాడా..అవకాశం వచ్చింది చిన్న సినిమానా అని ఆలోచించడం లేదు.

తనవరకూ ఏది వచ్చినా అది తన కెరీర్‌కి ప్లస్ అవుతుందనుకుంటే ఏమాత్రం వదలడం లేదు. ఇక్కడ డబ్బుకి డబ్బు పేరుకు పేరూ వస్తుంది. అందుకే తమ్మూ బేబీ చాలా పక్కాగా ప్లాన్ చేసుకొనే యంగ్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తుంది. ఇలాంటి క్వాలిటీసే ఇంతకాలం తమన్నా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news