Moviesతారక్ కోసం స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన డైరెక్టర్.. ఇక...

తారక్ కోసం స్టార్ హీరోని విలన్ గా మార్చేసిన డైరెక్టర్.. ఇక అరచకానికి అమ్మ మొగుడే..!?

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనదైన స్టైల్ లో నటిస్తూ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న తారక్ ప్రజెంట్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 అనే సినిమాకు కమిట్ అయి ఉన్నాడు. అన్ని సవ్యంగా జరిగుంటే ఈ సినిమా సగం షూటింగ్ కంప్లీట్ అయ్యి పోయి ఉండాలి. కానీ తారక్ కు కధ నచ్చక పోవడం..స్క్రిప్ట్ లో మార్పులు చేయమనడంతో సీన్ రీవర్స్ అయ్యింది. మరో రెండు వారల్లో సినిమా పూజా కార్య క్రమాలు మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వగానే నెల కూడా గ్యాప్ తీసుకోకుండా వెంటనే
బ్లాక్ బస్టర్ డైరెక్ టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 అనే సినిమా షూటింగ్ ని మొదలు పెట్టబోతున్నాడు తారక్.

ఇప్పటికే ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకున్న ప్రశాంత్ .. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు హీరోయిన్, విలన్ ను వెతికే పనిలో పడ్డారట . మనకు తెలిసిందే ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ప్రశాంత్ ని.. ఓవైపు ప్రభాస్ సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ విలన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా స్టార్ హీరోని ఫిక్స్ చేశారట ప్రశాంత్ నీల్.

ఆయన మరెవరో కాదు మల్టీ టాలెంటెడ్ చియాన్ విక్రమ్ . ఎస్ అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమాలో విక్రమ్ ని విలన్ గా చూపించబోతున్నాడట. ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ కి ఎంత ప్రత్యేకమైన పాత్రను రాసుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేజిఎఫ్ సిరీస్ లో హీరోకి సరి సమానంగా విలన్ పాత్రను డిజైన్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.

ఒకవేళ అదే కనుక నిజమైతే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందంటున్నారు నందమూరి అభిమానులు. అంతేకాదు ఎన్టీఆర్- విక్రమ్ ఒకే ఫ్రేమ్లో చూస్తే జనాలకు పూనకాలు వచ్చేస్తది అంటూ సినీ విశ్లేషకులు సైతం చెప్పుకోస్తున్నారు. ఇది గూస్ బంప్స్ కాంబో అని ప్రశాంత్ ఇలా కమిట్ అయితేనే బాగుంటుందని అంటున్నారు. మరి చూడాలి దీనిపై ప్రశాంత్ ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news