Moviesబిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రెడీ..ఇక ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!?

బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రెడీ..ఇక ఒక్కోక్కడికి పగిలిపోవాలే..!?

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షోగా ఫుల్ సక్సెస్ అయిన బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికే ఐదు సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ప్రజెంట్ ఆరో సీజన్ కొనసాగుతుంది. భారీ అంచనాల నడుమ మొదలైన ఈ బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. కొట్లాటలు, రొమాన్స్, ముద్దులు, హగ్గులు, స్ట్రాటజీలు అంటూ షోలో రచ్చ రచ్చ చేస్తున్నారు కంటెస్టెంట్స్. అయితే ఈ సీజన్లో పెద్దగా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు ఎవరూ లేరని మొదటినుంచి ట్క్ వినిపిస్తుంది. చలాకి చంటి , ఫైమా, రేవంత్, శ్రీహాన్ తప్పిస్తే ఈ బిగ్ బాస్ సీజన్ లో పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరూ లేరు.

దీంతో బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ దారుణాతి దారుణంగా పడిపోతుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లోకి పరమచెత్త టిఆర్పిరేటింగ్ సంపాదించుకున్న సీజన్ గా బిగ్ బాస్ 6 రికార్డ్ సృష్టించింది. అంతేకాదు బిగ్ బాస్ టిఆర్పిని ఎలాగైనా పెంచాలని నాగార్జున కాంటెస్టెంట్స్ మధ్య ఉన్నవి లేనివి పెట్టి రెచ్చగొడుతున్నా గాని కంటెస్టెంట్స్ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ క్రమంలోనే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ద్వారా షోలో మరింత రచ్చ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు బిగ్ బాస్. అందుకే ఐదో వారం ఎండింగ్లో బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ఎంటర్ అవ్వబోతునట్లు తెలుస్తుంది.


బిగ్ బాస్ సీజన్ 6 లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా ఎంటర్ అవ్వబోతుంది ఎవరో కాదు జబర్దస్త్ షో తో తన పాపులారిటీని డబుల్ చేసుకున్న సుడిగాలి సుధీర్ . ఎస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అవుతున్నారని తెలుస్తుంది .ఒకవేళ ఇదే గనుక నిజమైతే బిగ్ బాస్ టైటిల్ అందుకోబోయేది సుడిగాలి సుదీర్ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఆయనకు ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు హౌస్ లో ఉన్న ఏ ఒక్కరు కూడా సరిపోరు . అంతేకాదు సుడిగాలి సుదీర్ హౌస్ లోకి ఎంటర్ అయితే కచ్చితంగా వారు వన్ సైడ్ అయిపోతుంది . టోటల్ గేమ్ స్ట్రాటజీస్ అన్ని మారిపోతాయి . ఇప్పటివరకు జాన్ జిగుడి దోస్తులుగా ఉన్న హౌస్ మేట్స్ ..దీంతో అందరూ సుడిగాలి సుదీర్ వైపు మల్లే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అంటున్నారు నెటిజెన్స్. అంతేకాదు సుదీర్ హౌస్ లోకి వెళితే ఒక్కొక్కడికి పంచస్ తో పగిలిపోవాలి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి సుడిగాలి సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తాడో బిగ్ బాస్ హౌస్ లో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news