Moviesఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ చెప్పిన రాజమౌళి..మహేష్ మూవీపై మైండ్ బ్లోయింగ్...

ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ చెప్పిన రాజమౌళి..మహేష్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ..!!

వావ్..  మహేష్ బాబు అభిమానులకు జక్కన్న అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దీంతో ఆయన ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు . అంతేకాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా #SSMB29 ట్రెండింగ్ లోకి వచ్చింది. దానికి ఒకే ఒక్క రీజన్ రీసెంట్ గా రాజమౌళి చేసిన కామెంట్స్. మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గానే “సర్కారీ వారి పాట” అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని.. తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో మహేష్ నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి.

మరీ ముఖ్యంగా కీర్తి సురేష్, మహేష్ బాబు రొమాన్స్ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాగా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను షురూ చేశారు . ఈ సినిమాలో మహేష్ బాబు పూజ హెగ్డే తో రొమాన్స్ చేయబోతున్నారు . మరో హీరోయిన్ గా సంయుక్త మీనబ్ ని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మహేష్ బాబు కేవలం నాలుగు నెలల్లోనే కంప్లీట్ చేసి త్వరలోనే రాజమౌళితో బ్లాక్ బస్టర్ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట .

అంతేకాదు ఇప్పటికే దీనికి సంబంధించి రాజమౌళి కోసం ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ మైండ్ బ్లోయింగ్ కధను రెడీ చేసినట్టు కూడా తెలుస్తుంది. కాగా రాజమౌళి అమెరికాలో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ అనే ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే . ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆర్ఆర్ మూవీని ప్రదర్శించారు. ఆర్ఆర్ ప్రదర్శన అనంతరం రాజమౌళి ఆడియన్స్ తో కాసేపు ముచ్చటించారు . ఈ క్రమంలోనే ఆయన తన నెక్స్ట్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు .

“మహేష్ తో ఆయన చేయబోయే సినిమా తన సినీ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందని.. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఏ జోనర్ ని టచ్ చేయని విధంగా ఈ సినిమాలో మీరు మహేష్ బాబుని ఓ సాహసికుడిగా చూస్తారని.. కచ్చితంగా ఇది మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. సుమారు ఈ సినిమా కోసం 500 కోట్ల బడ్జెట్ పెట్టనున్నారని “రాజమౌళి చెప్పుకొచ్చారు. దీంతో రాజమౌళి చిత్రం అంటే రికార్డులు బ్రేక్ అవుతాయి. కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. మరి ఇలాంటి భారి బడ్జెట్ అంటే ఇండియన్ సినిమా లెక్క తిరగ రాయాల్సిందే..అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news