Moviesమరోసారి అర్జున్ రెడ్డి కాంబో.. ఈసారి లిప్ కిస్ కాదు..డైరెక్టు గా...

మరోసారి అర్జున్ రెడ్డి కాంబో.. ఈసారి లిప్ కిస్ కాదు..డైరెక్టు గా అదే..!?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ..పేరు జనాలకు ఎక్కించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ద్వారానే విజయ్ దేవరకొండ బాగా పాపులర్ అయిపోయాడు. అంతకుముందు సినిమాలు చేసినా కానీ విజయ్ దేవరకొండ పేరు పెద్దగా జనాలు గుర్తుపెట్టుకునే స్థాయికి వెళ్లలేదు. పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి తో మాత్రం ఓ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ సినిమాలో ఆయన నటన ,పెర్ఫార్మన్స్, డైలాగ్ డెలివరీ, ఆటిట్యూడ్, హెడ్ వెయిట్ ..ఏదైనా కావచ్చు అన్ని అర్జున్ పాత్రకు సరిపోయే విధంగా ఉన్నాయి .

ఈ పాత్రలో విజయ్ దేవరకొండను తప్పిస్తే మరి ఎవర్ని ఊహించుకోలేం. అంత ఖచ్చితంగా సెట్ అయిపోయాడు ఈ పాత్ర కు ఆయన. అర్జున్ రెడ్డి సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ముఖ్య కారణం ప్రీతి- అర్జున్ మధ్య రొమాంటిక్ సీన్స్. ఈ సినిమాను ఇప్పటికీ యూట్యూబ్లో, టీవీలో పెట్టుకొని.. న్యూ కపుల్స్ ..లవర్స్ అవే సీన్స్ రిపీట్ చేసి మరీ చూస్తుంటారు. అంతలా అర్జున్ రెడ్డి సినిమా అనగానే అందరికీ ఆ లిప్ కిస్ సీన్స్ గుర్తు వస్తాయి. కాగా మరోసారి ఇదే కాంబో తెర పై కనిపించనున్నట్లు సినీ వర్గాలల్లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే విజయ్ దేవరకొండ శివానిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం షాలిని పాండేను టీం అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె విజయ్ తో ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధపడిందట. అయితే ఈ సాంగ్ లో మాత్రం వీళ్ళిద్దరూ ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోనున్నట్లు ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. అదే కనుక నిజమైతే ఇంకోసారి ఇండస్ట్రీ షేక్ అయిపోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే . తెరపై విజయ్-షాలిని పాండే కెమిస్ట్రీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి అదే కాంబో రిపీట్ అయితే మాత్రం బాక్స్లు బద్దలు అవ్వాల్సిందే. ఈసారి డైరెక్ట్ గా జింతాక్కజితజిత అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి వీళ్లిద్దరి పర్ఫామెన్స్ జనాలకు ఎలా పిచ్చెక్కిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news