Moviesఅక్కినేని అభిమానులు పండగ చేసుకునే న్యూస్..నాగచైతన్య సినిమాలో సమంత బద్ధ శత్రువు.....

అక్కినేని అభిమానులు పండగ చేసుకునే న్యూస్..నాగచైతన్య సినిమాలో సమంత బద్ధ శత్రువు.. హీట్ పెంచేసిన క్రేజీ అప్డేట్..!!

వావ్: ఇలాంటి న్యూస్ కోసం కదా అక్కినేని అభిమానులు ఇన్నాళ్లు వెయిట్ చేసింది. అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ అందించాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. మనకు తెలిసిందే గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోతున్నాడు నాగ చైతన్య. వ్యక్తిగతంగానే కాదు సినిమా పరంగా కూడా ట్రోలింగ్ కి గురవుతున్న నాగచైతన్యకు ఈ సమయంలో ఒక్క బిగ్ హిట్ పడితే చాలు ..కధ మొత్తం రివర్స్ అయిపోతుంది . నాగచైతన్యను ట్రోల్ చేసే వారే ఆయనను మళ్ళీ పొగుడుతూ ట్విట్ చేస్తారు. ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య తన ఆశలన్నీ తాను చేసే నెక్స్ట్ సినిమా పై పెట్టుకుని ఉన్నాడు.

మనకు తెలిసిందే నాగచైతన్య థాంక్యూ సినిమాతో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన లాల్ సింగ్ చద్దా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇప్పుడు అందరి కళ్ళు వెంకట్ ప్రభు సినిమా పైన ఉన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది . కానీ అంతలోనే ప్రోటోకాల్ ను ఉల్లంఘించి అనుకొని చిక్కుల్లో ఇరుక్కుంది సినిమా బృందం. కాగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ ను రిలీజ్ చేశారు మూవీ టీం.

ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణీ నటిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు . దీంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు .మనకు తెలిసిందే సమంత కెరీర్ ని సర్వనాశనం చేసిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ప్రియమణి కూడా ఓ భాగం. కాగా గతంలో వీళ్లిద్దరికి పడడం లేదని.. వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వారు జరుగుతుంది అని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి .

దానికి తగ్గట్టే ఉ అంటావా మామ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ప్రియమణి సమంత పై హాట్ కామెంట్స్ చేసింది . దీంతో ఈ హీట్ మరింత పెరిగింది. కాగా ఇప్పుడు నాగచైతన్య సినిమాలో ప్రియమణి కీలకపాత్ర పోషిస్తూ ఉండడం.. సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మరి చూడాలి సమంత బద్ధ శత్రువు అయిన ప్రియమణి నాగచైతన్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో. ఈ సినిమాకు ఇళయరాజా ,యువన్ శంకర్ రాజ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కృత్తి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది .

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news