Moviesబాల‌య్య రికార్డును ట‌చ్ చేయ‌ని చిరంజీవి... అఖండ రికార్డుకు ఆమ‌డ దూరంలో...

బాల‌య్య రికార్డును ట‌చ్ చేయ‌ని చిరంజీవి… అఖండ రికార్డుకు ఆమ‌డ దూరంలో గాడ్ ఫాద‌ర్‌..!

టాలీవుడ్ లో ఎందరు హీరోలు ఉన్న సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ మధ్య పోటీ అంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. దాదాపు 40 సంవత్సరాలుగా వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతూ తమ సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్ ఫాద‌ర్ వచ్చింది. ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఈ సినిమా వసూళ్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ఈ క్రమంలోనే చిరంజీవిని ఓ విషయంలో బాలయ్య బ్లాక్ బాస్టర్ అఖండ సినిమాతో పోల్చి చూస్తున్నారు.

అయితే గాడ్ ఫాదర్ ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్ల‌తో పాటు మ‌రో రికార్డులో అఖండ రికార్డును టచ్ చేయలేకపోయింది. గాడ్ ఫాదర్ ఫస్ట్ వీక్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో రు. 40 కోట్లు రాబట్టింది. కర్ణాటకలో రు. 4.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రు. 4.55 కోట్లు, ఓవర్సీస్‌లో రు. 4.75 కోట్లు రాబట్టింది. ఓవ‌రాల్‌గా ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రు. 96 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 53 కోట్ల షేర్ కొల్లగొట్టింది.

అయితే గాడ్ ఫాదర్ కు ఏపీ, తెలంగాణలో ఏడో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. ఏడో రోజు ఈ సినిమాకు కేవలం రు. 83 లక్షల షేర్ మాత్రమే వసూలు అయింది. అదే బాలయ్య నటించిన అఖండ సినిమా ఏకంగా తొలి 11 రోజులు వ‌రుస‌గా కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ మాత్రం ఈ రికార్డు విషయంలో కేవలం ఆరు రోజులకే పరిమితం అయింది. ఇక గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా తొలి వారం రోజుల్లో రు. 53 కోట్ల షేర్ రాబడితే, అఖండ రు. 55 కోట్ల షేర్ రాబట్టింది.

ఇలా చిరంజీవి గాడ్ ఫాదర్ అఖండ రికార్డును టచ్ చేయలేకపోయింది. ఇక ఈ ఇద్దరు హీరోలు త్వరలోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేస్తున్న వాల్తేరు వీరయ్య, బాలయ్య మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news